Dog Viral Video: కుక్కకు అంతిమ సంస్కారాలు … చేసిందెవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ప్రశంసలు అందుకుంటున్న వీడియో..

శునకాలను విశ్వాసం, నమ్మకానికి ప్రతిరూపాలుగా భావిస్తుంటారు చాలామంది. అందుకే వాటిని తమ ఇంట్లోని సొంత సభ్యుల్లా ప్రేమతో చూసుకుంటారు. ఒక్కక్షణం అవి కనపడకపోతే అల్లాడిపోతుంటారు. ఇక ఆ మూగజీవాలు చనిపోయినప్పుడు వాటి యజమానులు ఎంతో ఆవేదన చెందుతారు..

Dog Viral Video: కుక్కకు అంతిమ సంస్కారాలు ... చేసిందెవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ప్రశంసలు అందుకుంటున్న వీడియో..

|

Updated on: Mar 13, 2022 | 9:47 AM


శునకాలను విశ్వాసం, నమ్మకానికి ప్రతిరూపాలుగా భావిస్తుంటారు చాలామంది. అందుకే వాటిని తమ ఇంట్లోని సొంత సభ్యుల్లా ప్రేమతో చూసుకుంటారు. ఒక్కక్షణం అవి కనపడకపోతే అల్లాడిపోతుంటారు. ఇక ఆ మూగజీవాలు చనిపోయినప్పుడు వాటి యజమానులు ఎంతో ఆవేదన చెందుతారు.. అంతేకాదు వాటికి అంతిమ సంస్కారాలు సైతం నిర్వహిస్తారు.అయితే ఇక్కడ చనిపోయిన ఓ కుక్కకు తోటి కుక్కలు అంతిమసంస్కారాలు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరు చలించిపోతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో… అప్పటివరకూ తమతో కలిసి జీవించిన శునకం చనిపోవడంతో తోటి కుక్కలు అంతిమ సంస్కారాలు చేశాయి. దాదాపుగా 10 కుక్కలు తమ కాళ్లతో ముందుగా ఓ గొయ్యి తవ్వాయి. అనంతరం చనిపోయిన కుక్కను ఆ గొయ్యిలో పడేసి.. తమ మూతితో మట్టిని దానిపై వేశాయి. కుక్కను పూడ్చడం కోసం కుక్కలు చాలా సమయం కష్టపడ్డాయి. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను ప్రముఖ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇవి జంతువులా’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. సుమారు 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రతి ఒక్కరికి కంట కన్నీరు తెప్పిస్తోంది. ‘చనిపోయిన కుక్కను ఇతర శునకాలు ఖననం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తోంది, మనుషుల కంటే జంతువులు చాలా సున్నితంగా ఉంటాయి. మూగజీవాలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్ల మనసులను హత్తుకుంటోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Follow us
Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?