AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Alert: TDS అంటే ఏమిటో తెలుసా..? సమయానికి టాక్స్ కట్టకపోతే ఎంత TDS కట్ చేస్తారు..? పూర్తి వివరాలు..

Tax Alert: జీతాలు, కమీషన్లు, అద్దెలు, వడ్డీలు, ప్రొఫెషనల్‌ ఫీజులు తదితర చెల్లింపులు జరిగేటప్పుడు మినహాయించుకునే కొంత మొత్తాన్నే టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) అని అంటారు. దీనిలో కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Tax Alert: TDS అంటే ఏమిటో తెలుసా..? సమయానికి టాక్స్ కట్టకపోతే ఎంత TDS కట్ చేస్తారు..? పూర్తి వివరాలు..
Tds
Ayyappa Mamidi
|

Updated on: Mar 14, 2022 | 8:11 AM

Share

Tax Alert: జీతాలు, కమీషన్లు, అద్దెలు, వడ్డీలు, ప్రొఫెషనల్‌ ఫీజులు తదితర చెల్లింపులు జరిగేటప్పుడు మినహాయించుకునే కొంత మొత్తాన్నే టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) అని అంటారు. ఇలా ముందుగానే సొమ్మును కలెక్ట్ చేయటం వల్ల పన్ను ఎగవేత తగ్గుతుందని ఐటీ శాఖ(Incoe Tax Department) చెబుతోంది. ఎందుకంటే చెల్లింపుల సమయంలో ముందుగానే పన్నును మినహాయించుకుంటున్నారు కాబట్టి. ప్రాపర్టీ అమ్మకాలు, డివిడెండ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ వంటి వాటిపైనా ఇది వర్తిస్తుంది. అయితే.. ఏటా రూ.50,000 టీడీఎస్‌ చెల్లించేవారికే ఇది వర్తిస్తుంది. వేతనం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రతినెల మినహాయించటం జరుగుతుంది. ఎన్నారైలకు(NRI) చేసే చెల్లింపులు, అధిక విలువ కలిగిన అమ్మకాలపైనా టీడీఎస్ వర్తిస్తుంది.

TDS విషయంలో మార్పులు..

కేంద్రం తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే.. ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించకపోతే.. ఇక నుంచి అధిక టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా దీనికి రెండేళ్ల వరకు గడువు ఉండేది. మూడో ఏడాది నుంచే అధిక టీడీఎస్‌ను చెల్లించాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021-22) ఈ జూలైలోపు ఐటీ చెల్లింపులను పూర్తిచేయాలి. గతేడాది మాదిరిగా పోర్టల్‌ లో ఏదైనా సమస్యలు తలెత్తి వాయిదా పడితే తప్ప.. గడువు ఈసారి మారకపోవచ్చు. ఒకవేళ జూలై 31లోపు చెల్లించకపోతే ఆ తర్వాత నుంచి వచ్చే ఆదాయంపై అధిక టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

రెట్టింపు టీడీఎస్‌..

ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139-1 ప్రకారం.. గడువు లోగా పన్ను చెల్లించకపోతే అధిక టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఈ ఆర్థిక సంవత్సరానికి మీరు జూలై 31లోగా ఐటీ రిటర్నులను దాఖలు చేయలేకపోయారనుకుందాం. ఆగస్టు నుంచి రావాల్సిన మీకు రావలసిన రాబడిపై దాన్ని చెల్లించే వ్యక్తి లేదా సంస్థ అప్పుడు రెట్టింపు టీడీఎస్‌ను మినహాయించుకుంటుంది. టీడీఎస్‌ రిటర్న్‌లను త్రైమాసికానికి ఒకసారి ఫైల్‌ చేస్తారు. కానీ అప్పటికే టీడీఎస్‌ చెల్లించేసి ఉంటారు. దీంతో కొన్ని సందర్భాలలో అవసరమైన దానికన్నా అధిక టీడీఎస్‌ను మినహాయించుకోవచ్చు. ఈ చిక్కులన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఇక నుంచి గడువులోగానే ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయటం ఉత్తమం.

ఇవీ చదవండి..

Ukraine Russia War: ఉక్రెయిన్ శరణార్థులకు బ్రిటన్ చేయూత.. అలా చేసిన వారికి నెలకు 450 డాలర్లు..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..