Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేల్ పై వాటిి ప్రభావం 6.8, 6.4గా నమోదయ్యాయి. ఈ ఘటనతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..
Earthquake
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:23 AM

Earthquake: మలేసియా రాజధాని కౌలాలంపూర్(KUALA LUMPUR)​ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్​ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. నగరానికి నైరుతి దిక్కున 504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో సుమారు 2.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోవటంతో స్థానికులు భయాందోళనకు(Locals in Fear) గురయ్యారు. భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

ఫిలిప్పిన్స్​లో కూడా భారీ భూకంపం సంభవించింది. మనీలా నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో భూకంపం తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన నేషనల్​ సెంటర్​ ఫర్​ సెసిమాలజీ వెల్లడించింది.

ఇవీ చదవండి..

Barack Obama: బరాక్ ఒబామాకి కరోనా పాజిటివ్‌.. ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడి..

National Handloom Expo: విజయవాడ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు భారీ స్పందన.. కొలువుదీరిన 15 రాష్ట్రాలకు చెందిన 120 స్టాల్స్..