AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia War: ఉక్రెయిన్ శరణార్థులకు బ్రిటన్ చేయూత.. అలా చేసిన వారికి నెలకు 450 డాలర్లు..

Ukraine Russia War: ఉక్రెయిన్‌ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అలా చేసిన వారికి 450 డాలర్లు అందించనున్నట్లు ఓ ఆఫర్ ప్రకటించింది.

Ukraine Russia War: ఉక్రెయిన్ శరణార్థులకు బ్రిటన్ చేయూత.. అలా చేసిన వారికి నెలకు 450 డాలర్లు..
Ukraine Refugees
Ayyappa Mamidi
|

Updated on: Mar 14, 2022 | 6:56 AM

Share

Ukraine Russia War: ఉక్రెయిన్‌ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ‘హోమ్స్‌ ఫర్‌ ఉక్రెయిన్‌'(Home for Ukraine) అనే పేరుతో ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బ్రిటన్‌ వాసులు ఎవరైనా.. ఉక్రెయిన్‌ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ప్రభుత్వం ప్రతినెల ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పున చెల్లిస్తానని తెలిపింది. బ్రిటన్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె ఈ విషయాన్ని వెల్లడించారు. నీడ అవసరమైన శరణార్థులకు మనమందరం కలిసి సురక్షితమైన ఇంటిని ఇద్దామని మిషెల్‌ గోవె అన్నారు.

ఇందులో భాగంగా శరణార్థులకు కనీసం ఆరు నెలల పాటు అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారవర్గాల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ కార్యక్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు ఎవరైనా ఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ రకంగా ఆశ్రయం ఇచ్చిన వారికి నెలకు 450 డాలర్లు చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకంగా చెల్లించనుంది.

శరణార్థులను ఆదుకునేందుకు యూకే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ ప్రజలకు 3000 వీసాలు జారీ చేసినట్లు యూకే వెల్లడించింది. గత గురువారం నుంచి.. ఉక్రెయిన్‌ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం ఆ దేశ పాస్‌పోర్టు ఉంటే చాలని తెలిపింది. యుద్ధ క్షేత్రం నుంచి వచ్చే ఉక్రేనియన్లకు వీలైనంత సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. వారికి విద్య, ఉద్యోగ, వైద్యంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలియజేశారు.

ఇవీ చదవండి..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..

Gold Silver Price Today: దూసుకుపోతున్న బంగారం.. భారీగా పెరిగిన వెండి ధర