Market Opening: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు.. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తున్న FPIలు..

Market Opening: వారం ప్రారంభంలో భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో మరో బెంట్ మార్క్ సూచీ నిఫ్టీ-50 కేవలం 40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.

Market Opening: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు.. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తున్న FPIలు..
Market News
Follow us

|

Updated on: Mar 14, 2022 | 9:53 AM

Market Opening: వారం ప్రారంభంలో భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో మరో బెంట్ మార్క్ సూచీ నిఫ్టీ-50 కేవలం 40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఇతర సూచీలైన బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్ల లాభంలో  ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం స్వల్పంగా 50 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పేటిఎం, జుబిలెంట్ ఫుడ్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా నేడు ఫోకస్ లో ఉన్నాయి.

నిఫ్టీ సూచీ లిస్ట్ లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యా్ంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో బీపీసీఎల్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, ఓఎన్జీసీ కంపెనీలు షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. రిజర్వు బ్యాంకు HDFC బ్యాంకుపై గతంలో పెట్టిన ఆంక్షలను ప్రస్తుతం ఎత్తివేయటం వల్ల కంపెనీ షేర్లు ఏకంగా 2 శాతం మేర లాభపడ్డాయి.

ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు FPI లు వరుసగా ఆరో నెలలోనూ తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీని కారణంగా వారు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి తమ ఇన్వెస్ట్ మెంట్లను వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం మార్చి నెలలో ఇప్పటి వరకు 45,608 వేల కోట్ల రూపాయలను వారు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి తరలించారు. గతంలో ఎన్నడూ ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇలా నమోదు కాలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి..

Bank Loan: సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై రుణాలు.. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఉంటుందంటే..!

GST Scam: నకిలీ వే- బిల్లులతో టాక్స్ క్రెడిట్ కొట్టేశారు.. ఫాస్ట్ టాగ్ కార్డులను అలా ఉపయోగించి..