AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digitally for Scrapping: పాత వాహనదారులకు ముఖ్య సూచన.. స్క్రాపేజ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ( MoRTH ) స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ద్వారా వాహనాలను స్క్రాప్‌కు పంపేందుకు డిజిటల్ ప్రక్రియను అవలంబిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Digitally for Scrapping: పాత వాహనదారులకు ముఖ్య సూచన.. స్క్రాపేజ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం
Scrap Vehicle
Balaraju Goud
|

Updated on: Mar 14, 2022 | 3:42 PM

Share

Digitally for Scrapping: రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) స్క్రాపేజ్ పాలసీ(Scrapping Policy)కి సంబంధించి ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ద్వారా వాహనాలను స్క్రాప్‌కు పంపేందుకు డిజిటల్ ప్రక్రియను అవలంబిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనం స్క్రాప్ చేయడానికి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ లేదా RVSF అవసరమని మంత్రిత్వ శాఖ తెలిపింది. స్క్రాప్ చేయడానికి ముందు, RVSF డిజిటల్‌గా ధృవీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే వాహనం జంక్‌కు పంపిస్తారు. స్క్రాప్ చేయాల్సిన వాహనం ఎటువంటి బకాయిలు పెండింగ్‌లో లేవని లేదా ప్రాంతీయ రవాణా అధికారులచే బ్లాక్‌లిస్ట్ చేయలేదని డిజిటల్ వెరిఫికేషన్(Digital Verification) స్పష్టం చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదాలో, ఏదైనా వాహనాన్ని స్క్రాప్ చేసే ముందు, మంత్రిత్వ శాఖ పోర్టల్ ‘వాహన్’ డేటాబేస్ నుండి అవసరమైన అన్ని తనిఖీలు జరుగుతాయి. వాహనాన్ని స్క్రాప్ చేసే ముందు వాహన యజమాని ఈ తనిఖీలన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అద్దె కొనుగోలు, వాహనం లీజుకు సంబంధించిన పత్రాల సరెండర్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో వాహనంపై ఎటువంటి కేసు లేదని రుజువు, వాహనంపై ఎటువంటి బకాయిలు పెండింగ్‌లో లేవని సర్టిఫికేట్, ప్రాంతీయ రవాణా శాఖ నుండి వాహనాన్ని బ్లాక్‌లిస్ట్ చేయని NOC వంటివి సమర్పించవలసి ఉంటుంది.

వాహన యజమాని ఏమి చేయాలి? ఈ కాగితాలేవీ లేని పక్షంలో స్క్రాపింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు వీలు లేదని ముసాయిదా పత్రంలో పేర్కొంది. ప్రతిపాదిత నియమం ప్రకారం, వాహన స్క్రాపింగ్ కోసం దరఖాస్తును డిజిటల్‌గా సమర్పించాలి. దీని కోసం RVSF సహాయం తీసుకోవడం జరుగుతుంది. స్క్రాపింగ్ కోసం వాహనాన్ని సమర్పించేటప్పుడు, వాహన యజమాని తన అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ఇలాంటి పత్రాలను కూడా RVSF ఆపరేటర్‌కు సమర్పించాలి. స్క్రాపింగ్‌కు సంబంధించిన పనిలో ఎటువంటి ఆటంకాలు లేనందున ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉన్నందున ఈ పేపర్‌లను కోరతారు.

స్క్రాపింగ్ వల్ల ప్రయోజనం దేశవ్యాప్తంగా మార్చి లేదా ఏప్రిల్‌లోనే వాహనాల స్క్రాపింగ్‌ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం స్క్రాపింగ్ సెంటర్లను తయారు చేసే పనులు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ప్రయోజనాల విషయానికొస్తే, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభిస్తూ, కొత్త వాహనం కొనుగోలుపై 5 శాతం తగ్గింపు ఇవ్వాలని అన్ని వాహన తయారీదారులకు మేము సలహా ఇచ్చామని చెప్పారు. స్క్రాపింగ్ సర్టిఫికేట్. వెహికల్ స్క్రాపింగ్ విధానం విన్ విన్ పాలసీ అని, దీని వల్ల కాలుష్యం వేగంగా తగ్గడమే కాకుండా ఆటో రంగానికి కూడా మేలు జరుగుతుందన్నారు.

యజమానులకు ఏం లాభం పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే వాహన యజమానులకు సర్టిఫికేట్ ఇస్తామని నిపుణులు చెబుతున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని చూపడం ద్వారా, కొత్త వాహనం కొనుగోలుపై 5 శాతం తగ్గింపు ఉంటుంది. ఆటో కంపెనీలు ఈ తగ్గింపును ఇస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే వారు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త వాహనం కొనుగోలుపై రోడ్డు పన్నులో 25% రాయితీ ఉంటుంది. వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్డు పన్నులో 15% రాయితీ లభించనున్నట్లు సమాచారం.

Read Also….  Devendra Fadnavis: నేరం చేయకుండానే మా నాన్నను ఇందిరా గాంధీ రెండేళ్లు జైల్లో పెట్టారు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!