ICMR – NIE Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. ఎన్‌ఐఈలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR - NIE) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల..

ICMR - NIE Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. ఎన్‌ఐఈలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
Icmr Nie
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2022 | 3:44 PM

ICMR – NIE Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR – NIE) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-సి, కన్సల్టెంట్‌, సైంటిస్ట్‌-డి, సీనియర్‌ రీజెర్చ్‌ ఫెలో పోస్టులు

విభాగాలు: మెడికల్‌, నాన్‌ మెడికల్‌, డేటా అనలిస్ట్‌

పే స్కేల్‌: నెలకు రూ.44,450ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ఎంఎస్‌/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: nieprojectcell@nieicmr.org.in

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NAARM Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఎన్ఏఏఆర్ఎమ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు!