AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ‘నా భార్య మగాడు’ విడాకుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త..

Supreme Court: వివాహం ఇరువురు వ్యక్తులను ఏకంచేసి ఒక పవిత్ర బంధం.. పెళ్లితో ఒక్కటైన జంట.. ఒకరిపై ఒకరు ప్రేమతో జీవితాంతం తోడు, నీడగా ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో

Supreme Court: 'నా భార్య మగాడు' విడాకుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త..
Wife Is Not Female
Surya Kala
|

Updated on: Mar 14, 2022 | 3:33 PM

Share

Supreme Court: వివాహం ఇరువురు వ్యక్తులను ఏకంచేసి ఒక పవిత్ర బంధం.. పెళ్లితో ఒక్కటైన జంట.. ఒకరిపై ఒకరు ప్రేమతో జీవితాంతం తోడు, నీడగా ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు పెళ్లిళ్లు ఆడ మగ లు మాత్రమే కాదు.. తాము ప్రేమించమంటూ ఇద్దరు మగవారు( Two Men), ఇద్దరు ఆడవాళ్లు(Two Women) కూడా పెళ్లి బంధంతో ఒకటి అవుతున్నారు. అయితే ఏ బంధమైన నమ్మకం, ప్రేమఉంటేనే కొనసాగుతుంది. అలాకాకుండా తాను మోసపోయాను అనే భావం కనుక భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి వచ్చినా ఆ బంధం ముళ్లబాట అవుతుంది. తాజాగా ఓ భర్త.. తనను భార్య .. ఆమె కుటుంబ సభ్యులు మోసం చేశారు.. విడాకులు ఇప్పించండి.. నా భార్య స్త్రీ  కాదు.. ఆ విషయం నా దగ్గర దాచి పెళ్లి చేశారు అంటూ ఓ బాధితుడు సుప్రీం మెట్లు ఎక్కాడు.  ఇదే విషయం పై మధ్యప్రదేశ్(Madhyapradesh) హైకోర్టు(high Court) పిటిషన్ ను తోసిపుచ్చడంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘భార్య ఆడది కాదు’ అని ఆరోపిస్తూ భర్త విడాకుల పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. తన స్పందన తెలియజేయాలని కోరుతూ ఆ మహిళకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 2016లో పెళ్లయింది. భార్య భర్తతో కాపురం చేయడానికి కొంతకాలం నిరాకరించింది.  అయితే తన భార్య స్త్రీ కాదని.. పురుషుడు అని భర్త గురించాడు. వైద్య పరీక్షల్లో ఆమెకు ఈ సమస్య పుట్టుకతో ఉన్నట్లు తెలిసింది. డాక్టలు ఈ సమస్యను ఆపరేషన్ తో సరిచేయవచ్చు.. కానీ పిల్లలు పుట్టరు అని చెప్పారు. దీంతో భర్త.. తనను భార్య.. ఆమె తరపు కుటుంబం అసలు విషయం చెప్పకుండా మోసం చేశారని భావించాడు. వెంటనే భార్య తల్లిదండ్రులను నిలదీశాడు. దీంతో ఒకరి పై ఒకరు పోలీసు కేసు పెట్టుకున్నాయి.  మధ్యప్రదేశ్ హైకోర్టు, గ్వాలియర్‌లోని బెంచ్ 29 జూలై 2021  భార్యకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు భర్త..ఆ తీర్పుని సవాల్ చేస్తూ.. తన భార్యతో విడాకులు ఇప్పించండి అంటూ మళ్ళీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

తన జీవిత భాగస్వామి వైద్య చరిత్రలో ఆమె ‘ఆడది’ కాదు.. కనుక తాను మోసపోయానని..  విడాకులు కోరుతూ భర్త చేసిన పిటిషన్‌పై భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది . 29-07-2021 నాటి మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్‌ను సవాలు చేస్తూ భర్త వేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్,  ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం భార్యను కోరింది.

Also Read: Holi Festival: మొదలైన హొలీ సందడి.. ప్రయాగ్‌రాజ్‌లో మోడీ మాస్కులకు అత్యధిక డిమాండ్