UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే చాలు..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ ఎడిటర్‌, ఫొటోగ్రాపిక్‌ ఆఫీసర్‌, సైంటిస్ట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి..

UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే చాలు..
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2022 | 3:10 PM

UPSC Assistant Editor Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ ఎడిటర్‌, ఫొటోగ్రాపిక్‌ ఆఫీసర్‌, సైంటిస్ట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 45

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎడిటర్‌, ఫొటోగ్రాపిక్‌ ఆఫీసర్‌, సైంటిస్ట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు

విభాగాలు: పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌, టోక్సికాలజీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 25

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIIL Mysore Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..