CIIL Mysore Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (CIIL).. ఒప్పంద ప్రాతిపదికన అకడమిక్‌ స్టాఫ్‌ పోస్టుల (Academic Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

CIIL Mysore Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Ciil Mysore
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2022 | 2:07 PM

CIIL Mysore Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (CIIL).. ఒప్పంద ప్రాతిపదికన అకడమిక్‌ స్టాఫ్‌ పోస్టుల (Academic Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 18

పోస్టుల వివరాలు: సీనియర్‌ ఫెలో, అసోసియేట్‌ ఫెలో, యూడీసీ, ఎల్‌డీసీ (అకడమిక్‌ స్టాఫ్‌) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,200ల నుంచి రూ.41,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Ginger: మీకు అల్లం తినే అలవాటుందా?అల్సర్, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, నోటి దుర్వాసనతోపాటు ఇంకా..