AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదేలు.. వేటాడాలనుకుంటే.. దిమ్మతిరిగే షాకిచ్చాయి..

సింహం వేట.. ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన విషయమే. కళ్లలో పడిన జంతువును వేటాడి చంపకుండా వదిలిపెట్టదు. అడవికి రాజైన

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదేలు.. వేటాడాలనుకుంటే.. దిమ్మతిరిగే షాకిచ్చాయి..
Lion
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2022 | 8:48 AM

Share

సింహం వేట.. ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన విషయమే. కళ్లలో పడిన జంతువును వేటాడి చంపకుండా వదిలిపెట్టదు. అడవికి రాజైన సింహానికి ఎంతటి భారీ ఖాయమున్న జంతువైన సరే భయంతో వణికిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో సింహం వేటకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో సింహం వేట.. వేటాడే తీరు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఈ వీడియోలు చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో సింహనికి చుక్కలు చూపించాయి కొన్ని గేదేలు. వేటాడి ఆకలి తీర్చుకోవాలనుకున్న సింహనికి దిమ్మతిరిగే షాకిచ్చాయి. అదేంటో చూద్దామా..

అసలు విషయం ఏంటంటే.. ఓ సింహం గేదేను వేటాడి చంపేయాలనుకుంది. గుంపులో ఉన్న ఓ గేదేను వేటాడాలని అక్కడికి చేరి అదును కోసం చూస్తుంది. సమయం రాగానే ఓ గేదేపై దాటి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న మిగతా గేదేలు సింహనికి ఎదురుతిరిగాయి. ఐకమత్యంతో సింహంపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గేదేలు ఎదురుతిరగడం చూసిన సింహం దెబ్బకు తొక ముడిచింది. అంతేకాదు.. వాటి నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చెట్టు ఎక్కింది. అయితే చెట్టు ఎక్కడం కూడా సింహనికి వీలు కాలేదు. దీంతో చెట్టు మధ్యలోనే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..