AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు (Pawan Kalyan) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ కోసం ఏమైనా

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..
Ganesh
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2022 | 5:02 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు (Pawan Kalyan) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. యూత్‏లో పవన్‏కు ఉండే క్రేజ్ గురించి తెలసిందే. పవర్ స్టార్‎కు ఉన్న అభిమానుల్లో నిర్మాత.. నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) స్థానం ప్రత్యేకం. పవన్ కళ్యాణ్‏ను దేవుడిలా ఆరాధిస్తుంటాడు. ఇక ఆయన గురించి బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ వేరేలెవల్. చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్‏లో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక దేవరా అంటూ అనేక పవర్ ఫుల్ డైలాగ్స్‏తో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‏కు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్స్‏కు బండ్ల గణేష్ వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఆయన రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బండ్ల గణేష్ రాకపోవడానికి గల కారణమేంటని పవన్ ఫ్యాన్స్ బాహాటంగానే అడిగారు. తాజాగా బండ్ల గణేష్ జనసేనా పార్టీ ఆవిర్భావ సభ గురించి వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

ఇవాళ ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీ ఆవిర్భావ సభపై వరుస ట్వీట్స్ చేస్తూ ఫ్యాన్స్‎ను ఉత్సాహపరుస్తున్నారు. ” వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అంటూ ట్వీట్ చేస్తున్నారు. దేవర జెండా కి కర్రనౌతా.. దేవర రధచక్రానికి కీలునౌతా .. అని.. ” ఇచ్చాపురం నించి హిందూపురం దాకా.. తడ నించి బెజవాడ దాకా.. జనసేన జెండా రెపరెపలాడాలి.. జనసేనాని జపం మారుమ్రోగాలి.. ” అంటూ వరుస ట్వీట్స్‏తో రచ్చ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ రేపు (మార్చి 14న).. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం .. ఇప్పటం గ్రామంలో జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్‌- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..

Kandikonda: స్వగ్రామం నాగుర్లపల్లిలోనేడు కందికొండ అంత్యక్రియలు.. బంధువుల కోరిక మేరకు చివరి నిమిషంలో మార్పు

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..