AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి మిస్టర్ సీ.. ఉపాసన (Upasana) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Charan Upasana
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2022 | 9:10 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి మిస్టర్ సీ.. ఉపాసన (Upasana) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లోనే ప్రేమికులుగా ఉండి.. ఆ తర్వాత తమ ప్రేమను వివాహబంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చరణ్ (Ram Charan) గురించి ఎప్పుడూ ఉపాసన.. తన భార్య గురించి చరణ్ పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను పంచుకుంటుంటారు. ఇక చరణ్ విషయానికి వస్తే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ.. ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గా పేరు తెచ్చుకుంటారు. కాస్త సమయం దొరికిన కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు.. ఇక చెర్రీకి వీలు చిక్కినప్పుడల్లా.. తన సతీమణితో కలిసి వెకెషన్స్ వెళ్తుంటాడు.. కానీ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ కారణంగా గత మూడేళ్లుగా సినిమా షూటింగ్ లో బిజీగా గడిపిన చరణ్.. ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీగా మారాడు.. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి.. సతీమణితో వెకెషన్ ఎంజాయ్ చేశాడు..

తాజాగా ఫిన్లాండ్ లో ఉపాసనతో కలిసి చరణ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. చెర్రీ.. ఉపాసన ఇద్దరూ ట్రాలీపై ఆటలాడుతూ కనిపించారు. ఆ తర్వాత.. మంచులో ఇద్దరూ సరదగా గడుపుతూ.. మంచునీటిలో స్వీమ్ చేస్తూ.. అలాగే..పేట్ డాగ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియోలో చెర్రీ పూర్తిగా చిన్నపిల్లాడిగా మారిపోయి.. ఉపాసనతో కలిసి అల్లరి చేశాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత చరణ్‏ను ఉపాసనను ఇలా చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్.. చెర్రీ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Also Read: Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..

Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..