Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

RRR Movie: సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్‌లు, ట్రైలర్‌లు, సాంగ్‌లతో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..
Rrr
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 14, 2022 | 9:12 PM

RRR Movie: సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్‌లు, ట్రైలర్‌లు, సాంగ్‌లతో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాలోని మరో అద్ధుతమైన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ఎత్తర జెండా పాటకు సంబంధించిన ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ తాజాగా సోమవారం ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది.

నిజానికి ఈ పాటను మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించింది. కానీ అనూహ్యంగా సోమవారమే విడుదల చేశారు. ఇక పాట తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ‘పారాయి పాలనపై కాలు దువ్వి, కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరులను తలుచుకుంటూ’ అంటూ ఈ పాట మొదలైంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరి కలిసి కనిపించే ఈ పాట సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి విడుదలకు ముందే సెన్సేషన్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena: అమెరికాలో గ్రాండ్‌గా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. న్యూజెర్సీలో సందడే సందడి.