Janasena: అమెరికాలో గ్రాండ్‌గా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. న్యూజెర్సీలో సందడే సందడి.
Janasena: పవన్ కళ్యాణ్ (Pawank Kalyan) జనసేన పార్టీ ఏర్పాటు చేసిన నేటికి సరిగ్గా ఎమిదేళ్లు. ఈ సందర్భంగా జనసేనాని గుంటూరు కేంద్రంగా సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి...
Janasena: పవన్ కళ్యాణ్ (Pawank Kalyan) జనసేన పార్టీ ఏర్పాటు చేసిన నేటికి సరిగ్గా ఎమిదేళ్లు. ఈ సందర్భంగా జనసేనాని గుంటూరు కేంద్రంగా సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగా సభకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ బహిరంగా సభలో పవన్ ఏం మాట్లాడుతారన్న దానిపై అందిరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో కూడా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సందడి చేశారు. అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో అమెరికా వ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా జన సైనికులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జనసేన ప్రధాన కార్యదర్శి చంటి నిర్వహించారు. ఆవిర్భావ వేడుకలకు పవన్ అభిమానులు, జనసేక కార్యకర్తలు ఎర్ర కండువలు ధరించి హాజరయ్యారు. న్యూజెర్సీకి చెంది పబ్లిక్ యుటిలిటీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆవిర్భావ వేడుకపై ఆర్గనైజర్ చంటి టీవీ9తో మాట్లాడుతూ.. ‘ఈ వేడుకులకు విభిన్న పార్టీలకు చెందిన వారు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఏపీలో జనసేన అధికారంలోకి రానుందనడానికి ఇదే నిదర్శనం. ఇలాగే ఆంధ్రాలో కూడా అందరు కలిసి అక్కడ జరుగుతోన్న అరాచక పాలనకు అంతమొందిస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్‌తో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది’ అంటూ జనసేన విజయంపై చంటి ధీమా వ్యక్తం చేశారు.
Stock Market: తగ్గుతోన్న క్రూడ్ ఆయిల్ ధర.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..