ముందుగా అల్లుడిని గాడిదపై గుడికి తీసుకెళ్లి, అక్కడ అల్లుడి హారతి ఇచ్చి, కొత్త బట్టలు, బంగారు ఉంగరం అందజేశాడట. దీంతో అప్పటినుంచి ఆ గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజున గ్రామ ప్రజలు ఈ తంతును సంప్రదాయంగా చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజున కొత్తగా పెళ్లయిన అల్లుళ్లతో ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా ఈ సంప్రదాయం కొనసాగించడానికి వీలుపడలేదు. ఈసారి అయినా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని సన్నాహాలు చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. కొంత మంది అల్లుళ్లు ఈ వింత తంతును పాటించలేక పారిపోతున్నారట కూడా! విచిత్రంగా ఉంది కదూ..