AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : రాజమౌళి వచ్చినా రేటు మారదు.. మాకు అంతా ఒక్కటే : పేర్ని నాని

ఏపీలో టికెట్ల సమస్య పరిష్కారమైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. ఆశించిన స్థాయిలో భారీగానే పెంచింది.

RRR Movie : రాజమౌళి వచ్చినా రేటు మారదు.. మాకు అంతా ఒక్కటే : పేర్ని నాని
Rrr
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2022 | 9:13 PM

Share

RRR Movie : ఏపీలో టికెట్ల సమస్య పరిష్కారమైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. ఆశించిన స్థాయిలో భారీగానే పెంచింది. తక్కువగా రూ.20 నుంచి 250 వరకు థియేటర్లు, ఏరియాలు, సీటింగ్‌ని బట్టి నిర్ణయించింది. భారీ సినిమాలకు పది రోజులపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. చిన్న సినిమాలకు ఐదో షోకి గ్రీన్‌ సిగ్నల్‌తోపాటు, కచ్చితంగా ఒక్క షో చిన్న సినిమాలకు కేటాయించాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` దర్శకుడు రాజమౌళి సోమవారం ఏపీ సీఎం జగన్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. మార్చి 25న `ఆర్‌ఆర్‌ఆర్‌` భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని రాజమౌళి ఎందుకు మీట్‌ అయ్యారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న రాజ‌మౌళి, దాన‌య్య అనంత‌రం అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు.

మొదట సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని మీట్‌ అయిన రాజమౌళి, దానయ్య అనంతరం సీఎంని కలిశారు. అయితే వీరిమధ్య ఈ నెల 25న విడుదల కాబోతున్న`ఆర్ఆర్ఆర్` సినిమాకి సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కోసం ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని సీఎం జగన్‌ని రాజమౌళి కోరారట. అలాగే సినిమా టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి చర్చించారు. టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటుని ఇవ్వాలని కోరినట్టు టాక్‌. రాజమౌళి పాటు సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రభుత్వం సినీ టికెట్ల జివో ఇచ్చిన తర్వాత సీఎంని కలిస్తామని నన్ను కోరారు అని నాని అన్నారు. ఈ రోజు సీఎం జగన్ కలిసి రాజమౌళి ,నిర్మాత దాన్యాయ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఐదుషోలకు అవకాశం ఉంది. చిన్న సినిమాకు ఒక షో ఇవ్వాలి.. అలాగే ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. రాష్ట్రంలో 1100 థియేటర్లు పెద్ద సినిమాలు ఉంటే ఒక షో మాత్రం చిన్న సినిమాకు ఉంది అని నాని అన్నారు.`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ స్థాయి కలెక్షన్లు రికవరీ కావాలంటే మామూలు విషయం కాదు. అందుకే టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని, మరోవైపు ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటుని కల్పించాలని కోరారని తెలుస్తుంది. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..

Follow Us