ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..

జోత్యిష్యశాస్త్రం ప్రకారం.. జన్మరాశి ఆధారంగా ఇతరుల స్వభావాలను అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ... ఫేస్ రీడింగ్.. సిగ్నేచర్ రీడింగ్..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..
Blood Groups
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 8:13 AM

జోత్యిష్యశాస్త్రం ప్రకారం.. జన్మరాశి ఆధారంగా ఇతరుల స్వభావాలను అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ… ఫేస్ రీడింగ్.. సిగ్నేచర్ రీడింగ్.. రాశులు.. పామ్ లైన్ ఇలాంటి వాటి ఆధారంగా.. వారి భవిష్యత్తు… స్వభావం గురించి తెలుసుకుంటారు. అయితే బ్లడ్ గ్రూప్ ఆధారంగా కూడా ఇతర వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు అంటున్నాయి ఇటీవల వెల్లడైన అధ్యయనాలు.. బ్లడ్ గ్రూప్స్ ద్వారా వ్యక్తిత్వంతోపాటు.. వారి ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ ఆధారంగా వారి ఇష్టాలు.. అయిస్టాలు. పని.. జీవితం గురించి అనేక సమాచారాన్ని తెలుసుకోవచ్చు..మరి ముందుగా ఎ (A) నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.

ఎ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల స్వభావం.. ఎ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్‏గా ఉంటారు. చాలా మృదు స్వభావం కలవారు. సున్నిత మనస్కులు. వీరు తమ స్నేహితులను పూర్తిగా విశ్వసిస్తారు. అంతేకాకుండా.. వీరిని స్నేహితులుగా పొందేవారు చాలా లక్కీ. తమకంటే ఇతరుల గురించి ఎక్కవగా ఆలోచిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచిస్తారు. దీంతో ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.

లక్షణాలు.. ఎ నెగిటివ్ బ్లడ్ గ్రూపు గల వ్యక్తులు.. వారికి ఎదైన విషయం నచ్చకపోతే సంకోచం లేకుండా సూటిగా చెప్పేస్తారు. వీరికి కోపం తొందరగా వస్తుంది. అలాగే.. ఇతరులను తొందరంగా నమ్ముతారు. వీరిని ఎక్కువగా రోల్ మోడల్‏గా ఉంటారు. వీరు చాలా స్ట్రాంగ్.. తమ నిర్ణయాలు.. ఆలోచనల పట్ల గట్టి నమ్మకంతో ఉంటారు.

లోపాలు.. ఎ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. క్షణాల్లో కోపం వస్తుంది. అలాగే తమవారి కోసం డబ్బు ఎంతైనా ఖర్చు చేయడానికి ఆలోచించరు.

లక్షణాలు.. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. అనుకున్న పనులను సాధించేవరకు ఊరుకోరు. ఇతరులను ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోంటారు. చాలా తెలివైనవారు. వీరు ప్రణాళికతో ముందుకెళ్తారు. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.

ఆరోగ్యం.. ఎ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు.. ఇతరుల కంటే బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉంటారు…అందుకే వీరు ఆరోగ్యకరమైన ఆహారం.. పండ్లు.. ఆకు కూరలు తినాలి.

ప్రేమ.. పెళ్లి.. ఎ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు బంధాలకు విలువనిస్తారు. వీరు చర్చలకు.. గొడవలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు. అలాగే వీరు బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేమ.. పెళ్లి వంటి వాటికి జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే