AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన తాజా చిత్రం రాధేశ్యామ్‌ (Radhe Shyam) విడుదల సందర్భంగా ఓ థియేటర్‌ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో మరణించిన అభిమాని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..
Prabhas
Basha Shek
|

Updated on: Mar 15, 2022 | 1:08 PM

Share

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన తాజా చిత్రం రాధేశ్యామ్‌ (Radhe Shyam) విడుదల సందర్భంగా ఓ థియేటర్‌ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో మరణించిన అభిమాని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. కాగా ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ శుక్రవారం(మార్చి11)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్లలో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యింది. మూడేళ్ల తర్వాత ప్రభాస్‌ సినిమా రానుండడం, పాటలు, ట్రైలర్లు అదిరిపోవడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ జరిగింది.

కుటుంబానికి అండగా..

ఇక తమ అభిమాన నటుడి సినిమా విడుదల కానుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. థియేటర్ల ముందు భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. ఇక విడుదల రోజు పెద్ద ఎత్తన పాలాభిషేకాలు నిర్వహించారు. అయితేఈ సంబరాల్లోనే ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద ప్రభాస్‌ బ్యానర్ కడుతూ చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని కన్నుమూశాడు. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్పందించిన డార్లింగ్‌ వెంటనే రెండు లక్షల రూపాయలు మృతుడి భార్య పిచ్చమ్మ అకౌంట్లో జమ చేయాలని తన సిబ్బందికి సూచించాడు. భవిష్యత్తులో కూడా కోటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాస్ దైర్యం చెప్పినట్లు సమాచారం.

Also Read:ICAR IARI Jobs: ఇండియన్‌ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Ola Electric Scooter: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఆ రెండు రోజులే అవకాశం..!

AP CM Jagan: టీడీపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫైర్‌.. కల్తీసారా ఘటనపై క్లారిటీ