AP CM Jagan: టీడీపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫైర్‌.. కల్తీసారా ఘటనపై క్లారిటీ

AP CM Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. కల్తీసారా ఘటనపై క్లారిటీ ఇచ్చారు...

AP CM Jagan: టీడీపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫైర్‌.. కల్తీసారా ఘటనపై క్లారిటీ
AP Cm Ys Jagan
Follow us

|

Updated on: Mar 15, 2022 | 12:30 PM

AP CM Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. కల్తీసారా ఘటనపై క్లారిటీ ఇచ్చారు. అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చామని, రెండు సంవత్సరాలలో 13వేల కేసులను నమోదు చేశామని వెల్లడించారు. అయితే సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మేలా ఉండాలని అన్నారు. ఒక అబద్దం చెప్పడం, గోబెల్స్‌ ప్రచారం చేయడం.. టీడీపీ (TDP) విధానం ఇలాగే ఉందని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. న సారా తాగిస్తే ప్రభుత్వ ఆదాయమే తగ్గుతుందని,

దేశంలో 2 శాతం కల్తీసారా తాగి చనిపోతున్నారని అన్నారు. జంగారెడ్డి గూడెంలో సారా కాయడం సాధ్యపడుతుందా..? అని ప్రశ్నించారు. సారా కాచేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. గోబెల్స్‌ డెమోక్రసీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకే అబద్దాన్ని నిజం చేయడానికి విషప్రచారం జరుగుతోందని ఆరోపించారు. జరగని ఘటనను జరిగిందని చూపిస్తున్నారని సభలో మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సీఎం జగన్‌ హితవు పలికారు. 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా, నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సారా తయారు చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు.

కాగా, ఆరో రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు స్పీకర్‌. పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Vellampalli Srinivas: పవన్‌కు మాట్లాడే అర్హత లేదు.. జనసేనానీపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం..

Target 2024: మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగనన్న ఏం చేయబోతున్నారో తెలుసా..