Target 2024: మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగనన్న ఏం చేయబోతున్నారో తెలుసా..
CM Jagan Target 2024: ఎలక్షన్స్ 2024 కోసం గేమ్ మొదలుపెట్టింది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంగా ఇవాళ YCLP సమావేశం నిర్వహిస్తోంది.
టార్గెట్ 2024(Target 2024), మరోసారి సూపర్ డూపర్ విక్టరీయే లక్ష్యం. అవును, 2024లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవడమే టార్గెట్‌గా వైసీపీ గేమ్ మొదలుపెట్టింది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వైసీఎల్పీ( YCLP) సమావేశం కాబోతోంది. ఎమ్మెల్యే లను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే మీటింగ్ మెయిన్ టార్గెట్. ఇప్పట్నుంచి ఎమ్మెల్యేలంతా జనంలోనే ఉండాలంటూ ఆల్రెడీ సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. వైసీఎల్పీ వైసీఎల్పీ మీటింగ్‌లో క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? ఏం చెప్పాలి..? మూడేళ్లలో ప్రభుత్వం చేసింది..? ఇలా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితులపై తన దగ్గరున్న నివేదికలను బయటపెట్టనున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించనున్నారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక, కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపైనా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మంత్రివర్గ మార్పులపై ఇప్పటికే సంకేతాలిచ్చిన సీఎం జగన్, వైసీఎల్పీ మీటింగ్‌లో దానిపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశముంది. మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.
దాంతో, కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుందో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం జగన్. సేమ్ టైమ్, మంత్రి పదవులు కోల్పోయినవాళ్లు, ఛాన్స్ దక్కనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించనున్నారు. టోటల్‌గా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.
ఇవి కూడా చదవండి: Viral Video: సింహాల గుంపుకి చుక్కలు చూపించిన గేదెలు.. ఫ్రెండ్ ఆపదలో ఉంటే కాపాడాల్సిందేగా..