Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..

సంధ్యా రాజు (Sandhya Raju) కూచిపూడి నృత్యకారిణి. నాట్యం (Natyam) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..
Ar Rahman
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 6:34 AM

సంధ్యా రాజు (Sandhya Raju) కూచిపూడి నృత్యకారిణి. నాట్యం (Natyam) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రశంసలు అందుకుంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సంధ్యారాజు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇటీవల సంధ్యారాజు చేసిన ఓ ప్రత్యేకమైన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఆ వీడియో చూసి సంధ్యా రాజును ప్రశంసించడం విశేషం..

అసలు విషయానికి వస్తే.. ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ రచయిత.. ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం ఫినామినల్ ఉమెన్‏కు మెడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‏లో ట్రెండింగ్‏లో దూసుకుపోతున్న ఈ వీడియోను ఎఆర్ రెహమాన్ ప్రశంసించారు. సంధ్యారాజు.. మోడ్రన్ కూచిపూడి.. పర్ఫామెన్స్ అద్భుతం.. మాయ దేవకన్య అంటూ పొగడ్తలు కురిపించారు.

ట్వీట్..

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు