Vellampalli Srinivas: పవన్‌కు మాట్లాడే అర్హత లేదు.. జనసేనానీపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం..
Vellampalli fire on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్‌కు మాట్లాడే అర్హత లేదంటూ వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Vellampalli fire on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్‌కు మాట్లాడే అర్హత లేదంటూ వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ ఇచ్చారంటూ విమర్శించారు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానంటూ పవన్ చెప్పారన్నారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో సోనియాగాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచామంటూ వెల్లంపల్లి పేర్కొన్నారు. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్‌లో ఉండే వారికి రాజకీయాలు ఎందుకంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. పవన్ రాజకీయాల్లో ఊసరవెల్లి లాంటివారంటూ విమర్శించారు. సీఎం జోలికొచ్చినా.. వైసీపీ జోలికొచ్చినా ఖబద్దార్ అంటూ వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. దేవాలయాలు కూల్చినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, నాగబాబుకు తమ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ వెల్లంపల్లి పేర్కొన్నారు.
జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏరకంగా అభివృద్ధి చేస్తారో వివరించారు. తాను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నానంటే కారణం తన సోదరుడు నాగబాబు అని అన్నారు. పార్టీలో గెలపోటములతో సంబంధం లేకుండా నాదెండ్ల మనోహర్ తన వెంటే నడిచారని.. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పారు.
వైసీపీ కొమ్ములు విరుస్తామంటూ హెచ్చరించారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని. విశాఖ, విజయవాడను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. వైసీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడుగునా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు.
Also Read: