Pawan Kalyan Speech: వైసీపీ కొమ్ములు విరుస్తా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే పని చేయం..

Janasena Formation day: జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్‌ అంటూ ప్రసంగం ప్రాంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు.

Pawan Kalyan Speech: వైసీపీ కొమ్ములు విరుస్తా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే పని చేయం..
Pavan Kalyan
Follow us

|

Updated on: Mar 14, 2022 | 9:13 PM

జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్‌ అంటూ ప్రసంగం ప్రాంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏరకంగా అభివృద్ధి చేస్తారో వివరించారు. తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన బహిరంగ సభలో భారీగా హాజరైన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌ ప్రసంగించారు. సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చిన ఇప్పటం గ్రామ పంచాయతీకి కృతజ్ఞతగా.. పంచాయతీకి నా వంతుగా రూ.50లక్షలు ఇస్తున్నా అని సభలో ప్రకటించాడు. ఈ సభ కోసం నెల రోజులుగా కష్టపడిన వారందరికీ అభినందనలు తెలిపారు. తను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నానంటే కారణం తన సోదరుడు నాగబాబు అని అన్నారు. పార్టీలో గెలపోటములతో సంబంధం లేకుండా నాదెండ్ల మనోహర్‌ తన వెంటే నడిచారు. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు.

ఒక పార్టీ నడపాలంటే సిద్ధాంతం ఉండాలని. 2014లో ఆరుగురు కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో పార్టీ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు ఆ కేంద్ర కార్యవర్గం 76 మందికి చేరిందని చెప్పారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల బలం 3 లక్షల 26 వేలకు చేరిందని.. త్వరలో 5 లక్షలకు చేరబోతోందని ప్రకటించారు. రెండున్నరేళ్లుగా వైకాపా పాలన ఎలా ఉంటుందో ఎదురుచూశానని.. వైకాపా వ్యక్తుల మీదగానీ, వైకాపా నాయకత్వంపై గానీ నాకు వ్యక్తిగత ద్వేషం లేదని పవన్ చెప్పారు. ఇంట్లో దిగినప్పుడు శుభంతో మొదలుపెడతామని. కానీ ఈ ప్రభుత్వం వస్తూనే కూల్చివేతలతో, అశుభంతో పాలనను మొదలుపెట్టిందన్నారు.

ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డు పడేశారని. వైకాపా పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడుగునా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. సీఎంలు మారినప్పుడుల్లా విధానాలు మారవని.. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతులు భూముల ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రాజు మారిన ప్రతిసారీ రాజధాని మారదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని.. అప్పుడు ఈ వైకాపా నాయకులంతా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.

ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ కొమ్ములు విరుస్తామని హెచ్చరించారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని. విశాఖ, విజయవాడను హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ ఇసుకను ఉచితంగా అందిస్తామని. సులభ్‌ కాంప్లెక్సుల్లో పనిచేసే ఉద్యోగాలు కాకుండా మీ కాళ్లమీద మీరు నిలబడగలిగేలా, ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం తరఫు నుంచి రూ.10లక్షలు అందిస్తామన్నారు.

రాష్ట్రంలో ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ.. దుర్వినియోగమే ఎక్కువగా అవుతోందని అన్నారు పవన్. పార్టీ ప్రకటనల కోసమే రూ.400 కోట్లు వృథా చేశారని వైకాపాపై ధ్వజమెత్తారు. పార్టీ రంగులు వేసుకునేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ వృథా ఖర్చు బదులు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చు కదా? అని పవన్ ప్రశ్నించారు. ఇలా దుబారా చేయడానికి డబ్బులు ఉంటాయిగానీ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో అడిగేవారు లేరని అన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పు అని చెబుతున్నారన్న పవన్‌కల్యాణ్‌.. అప్పులు తీర్చే మార్గాలను వెతకాలని సూచించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంటే ఎలా? అని నిలదీశారు. రూ.లక్ష కోట్ల ఆదాయం సద్వినియోగం చేయకపోతే.. ప్రభుత్వంలో లోపమున్నట్లేనని తేల్చి చెప్పారు. ఈ విషయాలు ప్రశ్నిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.

అల్లం వెల్లుల్లి- వెల్లంపల్లి, బంతి చామంతీ- అవంతీ అంటూ వైసీపీ మంత్రులపై సెటైర్లు విసిరారు పవన్ కళ్యాణ్. తాను సభకు వచ్చే ముందే- కొందరు వైసీపీ లీడర్లు తిట్టారని.. అందుకే ఇలా అనాల్సి వచ్చిందనీ వివరించారు సేనాని పవన్ కళ్యాణ్‌. భారతీయులంతా నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తాం. అదే వైసీపీ ఆంధ్రప్రదేశ్ నా అడ్డా అన్న ప్రతిజ్ఞ చేసిందంటూ సంచలన కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్.

Read Also.. Andhra Pradesh: నేటికీ ప్రారంభంకాని గోదావరి తీరంలో భవనాలు, వంతెనలు.. అసాంఘిక కార్యకలాపాకు అడ్డాగా

Latest Articles
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్