Pooja Hegde: జాతకాలు.. విధిరాతల పై బుట్టబొమ్మ పూజాహెగ్డే ఏమన్నదంటే..
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ పూజాహెగ్డే.
Pooja Hegde: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ పూజాహెగ్డే. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ లో ఆఫర్లు పట్టేసింది. హిందీలో ఏకంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో పూజ నటించిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ అమ్మడు ఇప్పుడు తమిళ్ లోనూ బిజీ అవ్వాలని చూస్తుంది. నిజానికి జీవ నటించిన మాస్క్ అనే సినిమాతో తమిళ్ లో పరిచయం అయ్యింది పూజా కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తమిళ్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది పూజ. ఇక ఇప్పుడు దళపతి విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తుంది.
నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించారు. విధి కి ప్రేమకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రమోషన్స్ లో ప్రభాస్ – పూజ హెగ్డేలకు దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు జాతకాలను నమ్ముతారా.. అని పూజను ప్రశ్నించగా.. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. విధిరాత ప్రకారమే అంతా జరుగుతుందని భావిస్తా అని చెప్పుకొచ్చారు. విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంటుంది పూజ.
మరిన్ని ఇక్కడ చదవండి :