AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam : రష్మీని ఫిలింనగర్ గేటుకు కట్టేస్తా అని బెదిరించా.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది.

Rashmi Gautam : రష్మీని ఫిలింనగర్ గేటుకు కట్టేస్తా అని బెదిరించా.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
Rashmi 1
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 3:58 PM

Share

Rashmi Gautam : బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక తనదైన మాటలతో యాంకరింగ్ తో కట్టిపడేసే రష్మీ .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ చిన్నది. కాంట్రవర్సీ కి ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటూ వస్తుంది. తన పై వచ్చే ట్రోల్స్ గురించి కూడా రష్మీ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు కూడా తక్కువే.. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ నిర్మాత రష్మీ పై ఆరోపణలు చేశారు. రష్మీ హీరోయిన్ గా ‘‘రాణి గారి బంగ్లా మూవీ సమయంలో తాను రష్మీని బెదిరించిందని.. అందుకే తనపై మండిపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Rashmiసీనియర్‌ నిర్మాత బాలజీ నాగలింగం ఇటీవల ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ..‘రాణి వారి బంగ్లా సినిమాకు హీరోయిన్ గా  రష్మీ సంతకం చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ పాట డబ్బింగ్‌కు వచ్చేసరికి సడన్ గా తాను సినిమా చేయను అంటూ  ఇబ్బంది పెట్టింది. అంతేకాదు హీరోని మార్చాలంటూ కూడా డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై తనతో  చాలా దురుసుగా వ్యవహరించింది. ‘నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు’ అంటూ నన్ను బెదిరించింది’’ అని చెప్పుకొచ్చాడు. దాంతో తనకు కోపం వచ్చి నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని తనకు కూడా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు అని అన్నారట.. అలాగే సినిమా మధ్యలో వదిలేస్తే న్యాయపరమైన చర్యలకు దిగుతానని .. ఫిలిం నగర్ గేటుకు కట్టేస్తా అని  బెదిరించడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్‌ పూర్తి చేసిందని ఆయన తెలిపాడు. అలాగే చివరిలో ట్విస్ట్ ఇస్తూ రష్మీ చాలా మంచి నటి..  సెకండ్ టెక్  తీసుకోకుండా ఎంతో డెడికేషన్ తో సినిమా చేసింది అని చెప్పుకొచ్చాడు.

Rashmi 3

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..