Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2022 | 7:18 PM

Pushpa The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. బన్నీ నటించిన సినిమాలు గతంలో మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మూవీలోని పాటలకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించి సంగీతం సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా శ్రీవల్లి పాట సోషల్ మీడియాలో నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ పాటకు భారీ వ్యూస్ దక్కాయి. అయితే ఈ పాటను చాలా మంది తమ స్టైల్ లోపాడటం.. లేదా ఈ పాటలోని హుక్ స్టెప్పును అనువదించడం వంటివి చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. తాజాగా ఈ పాట మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ముంబై పోలీసులు తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో  ‘శ్రీవల్లి’కి బ్యాండ్ వాయించిన వీడియోను పంచుకున్నారు. పోలీసులు  క్లారినెట్, సాక్సోఫోన్, ట్రంపెట్ అలాగే  ఫ్లూట్ వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించి శ్రీవల్లి పాటను అందంగా వాయించారు. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 8k కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు పోలీసులపై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..