Trains Know This: రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనవు.. ఇంతకీ.. ఏ టెక్నాలజీ ఎలా పని చేస్తోంది..? పూర్తి వివరాలు ఈ వీడియోలో
భారతీయ రైల్వే మరో అతిపెద్ద ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఒకే రైల్వే ట్రాక్‌పై వచ్చే రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఉండేందుకు రూపొందించిన కవచ్ రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరిశీలించింది. ఈ ప్రయోగాత్మకమైన కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు.
భారతీయ రైల్వే మరో అతిపెద్ద ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఒకే రైల్వే ట్రాక్‌పై వచ్చే రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఉండేందుకు రూపొందించిన కవచ్ రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరిశీలించింది. ఈ ప్రయోగాత్మకమైన కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు ఆయన. ఒక రైలులో తాను ప్రయాణిస్తుండగా, అదే రైల్వే ట్రాక్‌పై ఎదురుగా మరో రైలు వచ్చింది. కవచ్ రక్షణ వ్యవస్థ ఎదురుగా వచ్చే రైలును గుర్తించింది. ఈ టెక్నాలజీ నిమిషాల్లో రెండు రైళ్లకు అందడంతో రెండు రైళ్లు కొద్ది దూరంలోనే ఆటోమేటిగా ఆగిపోయేలా చేసింది కవచ్ వ్యవస్థ. వికారాబాద్ సెక్షన్‌లోని గొల్లగూడ చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్ పనితీరును పరిశీలించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఎదురెదురుగా వచ్చిన రైళ్లలో.. ఒకదానిలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రయాణించగా, మరో దానిలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్‌కుమార్ త్రిపాఠి ప్రయాణించారు. ఓకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించగా, అవి 380 మీటర్ల దూరం ఉండగానే కవచ్ వ్యవస్థ ప్రమాదాన్ని పసిగట్టి, ఆటోమెటిక్ బ్రేకులు పడి రైళ్లు ఆగిపోయాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..