AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాటే కిక్.. సింహానికి దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన జీబ్రా..!

Viral Video: జీబ్రా సాధారణంగా ఆఫ్రికాలో కనిపించే అడవి జంతువు. కానీ ఇది భారతదేశంలోని జంతుప్రదర్శన శాలలలో కూడా ఉంటుంది. జన్యుపరంగా ఇవి గుర్రాలు, గాడిదలకు

Viral Video: వాటే కిక్.. సింహానికి దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన జీబ్రా..!
Zebra Kick Lion
uppula Raju
|

Updated on: Mar 16, 2022 | 6:23 AM

Share

Viral Video: జీబ్రా సాధారణంగా ఆఫ్రికాలో కనిపించే అడవి జంతువు. కానీ ఇది భారతదేశంలోని జంతుప్రదర్శన శాలలలో కూడా ఉంటుంది. జన్యుపరంగా ఇవి గుర్రాలు, గాడిదలకు దగ్గరగా ఉంటాయి. కానీ అవి పెంపుడు జంతువులు కాదు. గుర్రాలు, గాడిదల మాదిరి వాటిని పెంచలేము. ఎందుకంటే అవి దూకుడు స్వభావం కలిగి ఉంటాయి. అమెరికాలోని జంతుప్రదర్శనశాలల్లో చాలాసార్లు ఉద్యోగులపై దాడి చేసి గాయపరిచాయి. అవి మందలుగా జీవించడానికి ఇష్టపడుతాయి. కానీ కొన్నిసార్లు ఒంటరిగా కూడా పోరాడుతాయి. అయితే జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా జీబ్రా, సింహానికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా నవ్వుకుంటారు.

ఈ వీడియోలో ఒక జీబ్రా అడవిలో ఒంటరిగా వెళుతుంటుంది. అనుకోకుండా సింహం దానిపై దాడి చేయడానికి ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. కానీ జీబ్రా సింహానికి దొరకకుండా వేగంగా పరుగెత్తుతుంటుంది. ఇంతలో సింహం దానిని వెనుక నుంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ జీబ్రా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. తన వెనుక కాళ్లతో సింహానికి గట్టిగా కిక్‌ ఇస్తుంది. దీంతో సింహం దూరంగా ఎగిరిపడుతుంది. జీబ్రా ఎస్కేప్ అవుతుంది. ఇది చాలా ఫన్నీ వీడియో చూసిన తర్వాత ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ 8 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో ప్రజలు వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్లు కూడా చేశారు. ఒక నెటిజన్ తమాషాగా ‘జీబ్రా కిక్‌ అదిరింది’ అన్నాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

SBI PO Final Result 2022: ఎస్బీఐ పీవో రిక్రూట్‌మెంట్‌ ఫైనల్‌ రిజల్ట్ విడుదల.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..!

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!