Sajjanar – TSRTC: సజ్జనార్ సార్ మీరు కేక.. ఆర్టీసీ కోసం ‘ఆర్ఆర్‌ఆర్’ని ఈసారి ఇలా వాడేసారు..!
Sajjanar - TSRTC: టీఎస్ఆర్టీసీ అంటే సజ్జనార్.. సజ్జనార్ అంటే ఆర్టీసీ అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. అవును, మునుపెన్నడూ..
Sajjanar – TSRTC: టీఎస్ఆర్టీసీ అంటే సజ్జనార్.. సజ్జనార్ అంటే ఆర్టీసీ అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. అవును, మునుపెన్నడూ.. ఎవరూ చేయని విధంగా వినూత్న పంథాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధి కృష్టి చేస్తున్నారు సంస్థ ఎండీ సజ్జనార్. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలకుండా ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ అంశం ఎక్కువ ట్రెండింగ్‌లో ఉంటే.. దానిని టీఎస్ఆర్టీసీకి అన్వయిస్తూ.. పబ్లిసిటీ కల్పిస్తున్నారు. మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘పుష్ప’ సినిమా డైలాగ్స్‌ను ఓ రేంజ్‌లో వాడిన సజ్జనారు.. నిన్న రాధేశ్యామ్‌ను ఉపయోగించుకున్నారు. ఇక ఇప్పుడు.. యావత్ సినీ ప్రేక్షక లోకం ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైటిల్ అర్థాన్నే మార్చేసి.. ఆర్టీసికి నెక్ట్స్ లెవల్ పబ్లిసిటీ ఇచ్చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ సరికొత్త అర్థాన్ని చెప్పారు. అంతటితో ఆగితే సజ్జనార్ ఎలా అవుతారు.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాటను కూడా ఆయన ఆర్టీసీకి పబ్లిసిటీ కోసం వాడేశారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ జెండా పట్టుకుని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాట పాడుతారు. సాధారణంగా ఈ పాటలో జెండాపై ‘వందేమాతరం’ అని ఉంటుంది. కానీ సజ్జనార్ చేసిన ట్వీట్‌లో ఆ ‘వందేమాతరం’ స్థానంలో టీఎస్ఆర్టీసీ లోగో, బస్సు గుర్తులు ఉన్నాయి. రెపరెపలాడుతున్న ఆ జెండాపై ఆర్టీసీ లోగో, బస్సు తళుక్కుమన్నాయి. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఆ ట్వీట్‌ను చూసి.. బాస్ అంటే మామూలుగా ఉండదు మరి అని కామెంట్స్ చేస్తున్నారు. సజ్జనార్ క్రియేటివిటీపై, ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.
#TSRTC is at the Service of Public #RRR – రాష్ట్ర రోడ్డు రవాణా #TSRTCPublicService #EtharaJenda @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @TarakFans @Chiru_FC @worldNTRfans @NTR2NTRFans @RRRMovie @AlwaysCharan_FC @TrackTwood @TV9Telugu pic.twitter.com/XybL6SDQWt
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 15, 2022
Also read:
Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!
Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!