SBI PO Final Result 2022: ఎస్బీఐ పీవో రిక్రూట్‌మెంట్ ఫైనల్ రిజల్ట్ విడుదల.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..!
SBI PO Final Result 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకి హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను SBI అధికారిక వెబ్‌సైట్
SBI PO Final Result 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకి హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2056 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 5 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభించారు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 25 అక్టోబర్ 2021 వరకు సమయం ఇచ్చారు. ఈ పోస్టులకి ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్-డిసెంబర్ నెలలో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్స్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ రౌండ్‌లో హాజరు కావాలి . ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ విడుదలైంది.
SBI PO ఫైనల్ రిజల్ట్ ఇలా తెలుసుకోండి..
1. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్- లేదా ibpsonline.ibps.inకి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన కరెంట్ ఓపెనింగ్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అడ్వర్టైజ్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
4. ఆ తర్వాత రిజల్ట్ లింక్‌కి వెళ్లండి.
5. ఫలితం PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.
6. అభ్యర్థులు రోల్ నంబర్ సహాయంతో ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు
అభ్యర్థుల ఎంపిక
SBI విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో ఇచ్చిన పనితీరు ఆధారంగా వారిని మెయిన్స్‌కి పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మూడో దశకు పిలుస్తారు.
ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ ఖాళీల ద్వారా మొత్తం 2056 పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించి 810 సీట్లు రెగ్యులర్‌గా ఉంచారు. మరోవైపు ఓబీసీ అభ్యర్థులకు 540 సీట్లు, ఆర్థికంగా బలహీన వర్గాలకు 200 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 300 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 150 సీట్లు ఉంటాయి. బ్యాక్‌లాగ్‌లో మొత్తం 56 సీట్లను భర్తీ చేస్తారు.