NEET PG 2021: వైద్య విద్యార్ధులకు అలర్ట్‌! నీట్‌ పీజీ 2021 కటాఫ్‌ మార్కులు 15 శాతానికి తగ్గింపు..

నీట్‌ 2021 పీజీ వైద్య విద్య కటాఫ్‌ మార్కులను 15 శాతం తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది...

NEET PG 2021: వైద్య విద్యార్ధులకు అలర్ట్‌! నీట్‌ పీజీ 2021 కటాఫ్‌ మార్కులు 15 శాతానికి తగ్గింపు..
Neet Pg 2021
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2022 | 9:23 AM

NEET PG 2021 Cut-off reduced: నీట్‌ 2021 పీజీ వైద్య విద్య కటాఫ్‌ మార్కులను 15 శాతం తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యా  శాఖ  బోర్డును ఆదేశించిన తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ 2021) కటాఫ్ మార్కులను తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల భర్తీకి గానూ అన్ని కేటగిరీల్లో నీట్ పీజీ కటాఫ్ మార్కులను 15 శాతం తగ్గించింది. ‘సీట్లు వృధా’ కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్పింది. కటాఫ్‌ తగ్గింపుతో సుమారు 25,000 మంది విద్యార్ధులు మాప్ రౌండ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. ఆల్ ఇండియా కోటా కింద రెండు రౌండ్లు, రెండు రౌండ్ల స్టేట్ కోటా కౌన్సెలింగ్ తర్వాత కూడా 8,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కేంద్రం అనుమతి మేరకు కటాఫ్‌ను తగ్గించినట్లు NMC తెలిపింది. ఐతే నీట్ పీజీ 2021 ర్యాంక్‌లో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST/OBC)కి 25 శాతం (కటాఫ్‌ మార్కులు 210), జనరల్‌ కేటగిరీకి 35 శాతానికి (కటాఫ్‌ మార్కులు 247), దివ్యాంగ కేటగిరీకి 30 శాతంగా (కటాఫ్‌ మార్కులు 229) కటాఫ్‌ మార్కులు తగ్గాయి.

ఇక ఈ ఏడాది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష (NEET UG 2022) జూన్ లేదా జూలైలో జరగనుంది. విద్యాశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్‌ మూడవ వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నీట్‌ యూజీ పరీక్షను దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడాదికోసారి జరిగే ఏకైక ప్రవేశ పరీక్ష ఇది. కాగా గత ఏడాది.. కోవిడ్‌ (COVID-19) కారణంగా ఈ పరీక్షలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాయిదా అనంతరం సెప్టెంబర్‌లో నీట్‌ 2021 పరీక్ష జరిగింది. అంతేకాకుండా సిలబస్‌ను కూడా చాలా వరకు తగ్గించిన ఎన్టీఏ.. నీట్ 2021 పరీక్షను మల్టిపుల్ ఛాయిస్‌ క్వశ్చన్ల రూపంలో నిర్వహించింది. ఐతే ఈ ఏడాది నీట్‌ 2022 కూడా గత సంవత్సరం మాదిరిగానే మల్టిపుల్ ఛాయిస్‌ క్వశ్చన్ల రూపంలోనే ఉంటుందనే విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

అలాగే నీట్‌ 2021 అప్లికేషన్‌ ప్రాసెస్‌ కూడా రెండు దశలుగా విభజించింది. పరీక్షకు ముందు మొదటి దశలో కొంత సమాచారాన్ని సమర్పించాలి. ఫలితాలకు ముందు అంటే పరీక్ష తర్వాత రెండో దశలో మిగిలిన సమాచారాన్ని సబ్‌మిట్‌ చెయ్యాలి. గతంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే నీట్‌ పరీక్షను ఉపయోగించేవారు. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కూడా నీట్‌ పరీక్ష ద్వారానే చేపడుతున్నారు. ఇక నీట్‌, జేఈఈ రెండు పరీక్షలకు టై బ్రేకింగ్ విధానం నుంచి అభ్యర్థుల వయస్సు ప్రమాణాన్ని ఎన్టీఏ తొలగించింది. అంటే ఎక్కువ వయసున్న అభ్యర్థికి ర్యాంకు లిస్టులో ప్రాధాన్యత ఉండదన్నమాట.

Also Read:

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్