AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తగ్గేదే లే అంటున్న ఎమ్మెల్యే.. వయసు సంఖ్యకే మనసుకు కాదంటూ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు..!

Viral Video: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వయసు మాత్రమే ఎక్కువ గానీ.. ఆయన ఎల్లప్పుడూ యువకుడి..

Viral Video: తగ్గేదే లే అంటున్న ఎమ్మెల్యే.. వయసు సంఖ్యకే మనసుకు కాదంటూ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు..!
Mla Dance
Shiva Prajapati
|

Updated on: Mar 16, 2022 | 6:55 AM

Share

Viral Video: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వయసు మాత్రమే ఎక్కువ గానీ.. ఆయన ఎల్లప్పుడూ యువకుడి మాదిరిగానే హుషారుగా ఉంటారు. రాజకీయాల్లో అయినా.. సాధారణ సమయాల్లో అయినా ఆయన చలాకీగా ఉంటారు. ఒక పొలిటికల్ విమర్శల విషయానికి వస్తే మాత్రం.. మాంచి జోష్‌లో కామెంట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో ఆయన వేసే పొలిటికల్ సైటర్లు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. సోషల్ మీడియాలోనూ, బయటా ఫుల్ యాక్టీవ్‌గా ఉండే గోరంట్ల.. ఇవాళ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంబరాలు అంటే అట్లాంటి ఇంట్లాంటి సంబరాలు కాదండోయ్.. అన్నీ తానై వ్యవహరించి కార్యకర్తల్లో మాంచి ఊపు తీసుకువచ్చారు. సంఖ్య మాత్రమే పెరిగిందని, తాను మాత్రం ఇంకా యువకుడినే అంటూ.. కార్యకర్తలతో కలిసి ఫుల్ మస్తీ చేశారు. బర్త్‌డే వేడుకల్లో కార్యకర్తలతో కలిసి చిందులేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలను టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ డీజే ఏర్పాటు చేయగా.. కార్యకర్తలతో కలిసి ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. వారితో కలిసి డ్యాన్స్ చేశారు. దాంతో కార్యకర్తలు మరింత జోష్ ప్రదర్శించరు. బుచ్చయ్య చౌదరిని తమ భుజాలపై ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. కాగా, ఈ వయసులో కూడా ఎమ్మెల్యే బుచ్చయ్య వారితో కలిసి డాన్స్‌లు చేయడం, ఆయనలోని ఎనర్జీ అందరినీ తెగ ఆట్టుకుంది. కాగా, ఎమ్మెల్యే తీన్ మార్ స్టెప్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యారు. ఎమ్మెల్యే గారూ తగ్గేదే లే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also read:

Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!

SBI Customers alert: మార్చి 31 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఖాతాదారులను అలర్ట్ చేసిన ఎస్‌బిఐ..

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!