AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

రిలీజ్ డేట్లు మారిపోయినా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు మేకర్స్. అనుకోకుండా దొరికిన బ్రేక్‌ని టూ ఇంటిలిజెంట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..
Rrr Movie
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 8:20 PM

Share

RRR Movie: రిలీజ్ డేట్లు మారిపోయినా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు మేకర్స్. అనుకోకుండా దొరికిన బ్రేక్‌ని టూ ఇంటిలిజెంట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు. సెకండ్ టైమ్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో డిజైన్ చేసుకుని తమ సినిమాల్ని సక్సెస్‌ దిశగా నడిపించుకుంటున్నారు. మరి.. జక్కన్న వ్యూహమేంటి. ట్రిపులార్ సెకండ్ ఫేజ్ ఎలా వుండబోతోంది…? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది జక్కన్నకుండే మొండి ధైర్యం. సినిమా మేకింగ్ నుంచి ప్రమోషన్‌ దాకా దర్శకధీరుడికంటూ.. ఒక స్టయిల్ వుంటుందనేది క్లియర్. సంక్రాంతి సీజన్‌ని మిస్సయ్యామన్న చిన్న డిజప్పాయింట్ తప్పితే తన సినిమా మీద రాజమౌళి దగ్గర నైతిక స్థైర్యం తగ్గనే లేదు. కాకపోతే… ప్రమోషన్‌కి పెద్దగా టైమ్ లేదు. మార్చి లాస్ట్ వీకెండ్‌లోనే రాబోతోంది ట్రిపులార్ మూవీ. కేవలం రెండేరెండు వారాల్లో ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్‌ని ప్రమోట్ చేయడమంటే మాటలు కాదు. ఇద్దరు హీరోలతో మ్యూచ్యువల్‌గా చేసిన దోస్తీ పాట, ఇండివిడ్యువల్‌ ప్రమోషనల్ సాంగ్స్‌, బోనస్‌గా జననీ థీమ్ సాంగ్, ఫైనల్‌గా పవర్‌ఫుల్ ట్రైలర్… అన్నీ ఫస్ట్ ఫేస్‌లోనే బైటికొచ్చేశాయి. అందుకే… ఫ్యాన్స్‌కి న్యూ ఫీల్ కలిగించే ఎక్స్‌ట్రా ప్రమోషనల్ స్టఫ్‌ కోసం కసరత్తు మొదలుపెట్టారు జక్కన్న. సెకండ్ ట్రయిలర్ రిలీజ్ చేసి, మోర్ అడ్వాంటేజ్ పొందిన భీమ్లా అండ్ రాధేశ్యామ్‌ సినిమాల స్ట్రాటజీ మీద కూడా ఓ కన్నేశారట. సినిమాలోని స్పెషల్ ఎలిమెంట్స్‌ని రీఇంట్రడ్యూస్ చేస్తూ కొత్తగా ఒక మినీ ట్రయిలర్‌ని రూపొందిస్తోంది ట్రిపులార్ టీమ్. చెర్రీ అండ్ అలియా మీద పిక్చరైజ్ చేసిన మరో పాటను కూడా దాచిపెట్టే వుంచారట. రిలీజ్‌డేట్‌కి వారం రోజుల ముందు జరిగే ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ఈ పవర్‌ఫుల్ స్టఫ్‌ని బైటికొదిలే ఛాన్సుంది. రాధేశ్యామ్ సందడి ముగిసి, ఒక్కసారి డార్లింగ్ క్యాంప్‌ అంతా రెస్ట్ జోన్‌లోకి చేరిపోతే… జక్కన్న టీమ్‌ లైమ్‌లైట్‌లోకొచ్చేస్తుందన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!