AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

క్రియేటివ్ స్కిల్స్‌కి సరిహద్దులనేవి వుండవు... వుండకూడదు కూడా. అందుకే అడ్డుగోడలు పగలగొట్టుకుని అందరూ పాన్ ఇండియా వైపు చూస్తూన్నారు.

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి
Boyapati Surya
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 7:56 PM

Share

Boyapati Srinu: క్రియేటివ్ స్కిల్స్‌కి సరిహద్దులనేవి వుండవు.. వుండకూడదు కూడా. అందుకే అడ్డుగోడలు పగలగొట్టుకుని అందరూ పాన్ ఇండియా వైపు చూస్తూన్నారు. కొందరైతే అవకాశాల కోసం వెయిటింగ్‌లో వున్నారు. కొత్తగా రెక్కలొచ్చెనా అంటూ, అలా అవతలివైపు చూస్తున్న దర్శకుల జాబితాలోకి కొత్తకొత్త ఎంట్రీలు చేరిపోతున్నాయి. మెగాస్టార్ మానసపుత్రిక సైరాకు డైరెక్టర్‌గా నార్త్‌లో ఇంట్రడ్యూస్ అయ్యారు కెప్టెన్ సూరి. కాకపోతే. ఆశించిన స్థాయిలో కమర్షియల్ మైలేజ్ రాలేదన్న వెలితి మాత్రం అలాగే వుండిపోయింది. అందుకే లేటెస్ట్‌గా పాన్ ఇండియా వైపు మరో ఎఫర్ట్ పెట్టబోతున్నారు. టెరిఫిక్ యాక్షన్ వెంచర్‌గా రూపొందుతున్న అఖిల్ నెక్స్ట్ మూవీ ఏజెంట్‌.. రేసుగుర్రం డైరెక్టర్‌ కంటున్న గోల్డెన్‌ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చెయ్యబోతోంది. ఏజెంట్‌ మూవీలో రూత్‌లెస్‌ సేవియర్‌గా, డెవిల్‌ లాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు మమ్ముట్టి. ఇప్పటికే యాత్ర మూవీతో టాలీ ఆడియన్స్‌ను ఫిదా చేశారు మమ్ముకా. ఇప్పుడు అఖిల్‌ సినిమాతో నెక్స్ట్ లెవల్‌ చూపించబోతున్నారు. సో… ఏజెంట్‌ ద్వారా మలయాళ మార్కెట్‌ని టచ్ చెయ్యబోతున్నారు అఖిల్ అండ్ సూరి. అటు.. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో సరైనోడు అనిపించుకున్న బోయపాటి సైతం ఔటాఫ్‌ ది బాక్స్ ఆలోచించడం మొదలుపెట్టారు. అదన్నమాట విషయం. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరో సూర్యతో బోయపాటి కాంబినేషన్‌ని త్వరలో చూడబోతున్నామన్నమాట. తెలుగు హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో నిలబెట్టిన బోయపాటి.  తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ని కోలీవుడ్‌ ఆడియన్స్‌క్కూడా పరిచయం చేసే ఛాన్సుంది. ఇప్పటికే నాన్‌-తెలుగు హీరోల్ని డైరెక్ట్ చేస్తున్న వంశీపైడిపల్లి, శేఖర్‌ కమ్ముల జాబితాలో బోయపాటి లాంటి మరికొన్ని సర్‌ప్రైజ్ ఎంట్రీస్‌ని చూడబోతున్నాం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..