AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

నువ్వు హీరో అయితే నేను షీరో.. అంటూ టచ్‌ చేసి చూడు రేంజ్‌లో స్టామినా ప్రూవ్ చేసుకుంటున్న మరో ఫిమేల్ గ్లామర్‌ స్టార్ అలియా భట్ .

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.
Alia
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 7:40 PM

Share

Alia Bhatt : నువ్వు హీరో అయితే నేను షీరో.. అంటూ టచ్‌ చేసి చూడు రేంజ్‌లో స్టామినా ప్రూవ్ చేసుకుంటున్న మరో ఫిమేల్ గ్లామర్‌ స్టార్ అలియా భట్. రిసెంట్‌ డేస్‌లో కాశ్మీర్ టు కన్యాకుమారి.. మోస్ట్ హ్యాపెనింగ్ గాళ్‌ అనిపిస్తున్నారు అలియా భట్. ఆల్‌రౌండర్ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతూ.. తన ఇమేజ్‌తో టోటల్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారీ బీటౌన్  భామ. అందానికి అందం.. దర్పానికి దర్పం.. ఏ విషయంలోనూ తీసిపోని బబ్లీ గాళ్ అలియా భట్. లేటెస్ట్‌గా గంగూబాయ్‌తో కొట్టిన సోలో హిట్టు… ఆమెను భన్సాలీ హీరోయిన్‌గా గట్టిగానే స్టాంపేసి పంపింది. కంగనా తలైవి కంటే..అలియా గంగూబాయ్‌కే బెటర్ మార్కులు పడ్డంతో సౌత్‌లో ఆమె ఫాలోయింగ్ పెరగడం మొదలైంది.

ఆల్రెడీ ఆర్ఆర్ఆర్  సినిమాలో చెర్రీకి జోడీగా సీత పాత్రలో కనిపిస్తున్న ఆలియా… మరోసారి జక్కన్న ప్రపోజల్‌ని ఓకే చేశారన్నది ఈ మధ్య వైరల్ అవుతుంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా రాజమౌళి చేస్తున్న ఆఫ్రికన్ అడ్వెంచరస్ మూవీలో ఫిమేల్ లీడ్‌కి అలియా పేరును షార్ట్‌ లిస్ట్ చేశారట. అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఒక్కటే పెండింగ్. ఇప్పటికే కొరటాల చేస్తున్న తారక్ థర్టియత్ మూవీలో హీరోయిన్‌గా ఫిక్సయ్యారు అలియా. ఎన్టీయార్‌-అలియా కాంబో త్వరలో షురూ కాబోతోందన్నది క్లియర్. ఆ తర్వాత జక్కన్న కెప్టెన్సీలో సెకండ్‌టైమ్‌ జాయినయ్యి సూపర్‌స్టార్ మహేష్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తారు ఆలియా. ఇటు టాలీవుడ్‌లో హ్యాట్రిక్ మూవీస్‌తో హల్‌చల్ చేస్తూనే అటు.. బాలీవుడ్‌లో బ్రహ్మాస్త్ర లాంటి భారీ సినిమాల్లో నటిస్తున్నారు. కట్ చేస్తే.. హాలీవుడ్‌ కూడా వెల్‌కమ్ చేసిందీ సీతమ్మవారిని. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ఇంగ్లీష్ ఫిలిమ్ హార్ట్ ఆఫ్ స్టోన్‌లో అలియా నటిస్తారన్నది లేటెస్ట్ న్యూస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి