AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Shesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). అడివి శేష్ నటిస్తోన్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ ఇది.

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..
Major
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2022 | 6:35 AM

Share

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Shesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). అడివి శేష్ నటిస్తోన్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీ మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వేసవి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. అలాగే మలయాళంలోనూ విడుదల కానుంది.

మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. 26/11 సంఘ‌ట‌న హీరోగా నిలిచిన మేజ‌ర్‌ 45వ జ‌యంతి సందర్భంగా మేజర్ చిత్రయూనిట్ అతని జీవితంపై హృదయపూర్వకమైన నివాళిని వీడియో రూపంలో తెలియ‌జేసింది. ఈ వీడియో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌‏తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గ‌డిపిన అత్యుత్తమ క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది. చివ‌రివ‌ర‌కు ఇమేజెస్‌లో మేజర్‌లోనూ, శేష్‌లోనూ మనకు పెద్దగా తేడాలు కనిపించవు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌యంతి సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ గుర్తింపుగా నిలుస్తుంది. ఈ చిత్ర టీజర్‌పై భారీ అంచనాలు నెలకొనగా, మొదటి పాట `హృదయమా` సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.

బహుభాషా చిత్రంగా రూపొందిన మేజర్ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో సంవత్సరాల నుండి వున్న‌ప్ప‌టినుంచీ అతను మరణించిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను స్పృశిస్తుంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్‌, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..