AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2022 | 9:08 AM

Share

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్‏నెస్‏గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికంగా షేర్ చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తారు. పునీత్ నటించింది తక్కువ సినిమాలే అయినా.. నటన పరంగా మెప్పించారు. అంతేకాకుండా.. అనేక సేవా కార్యక్రమాలు ఆయనను మహోన్నత వ్యక్తిగా నిలిపాయి. గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణానికి ముందు యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక పునీత్ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్… ఆయన మరణించే సమయానికి ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్.. ట్రేడ్ మార్క్ లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా పునీత్ జ్ఞాపకాలను తలుచుకుంటూ జేమ్స్ చిత్రయూనిట్‏కు ఆల్ ది బెస్ట్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ప్రియమైన అప్పు. ఒకరోజు నువ్వు అనుహ్యంగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయావు.. ఈ విషయాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాము..ఇప్పుడు నువ్వు నటించిన ఆఖరి చిత్రం జేమ్స్. ఈనెల 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భం మా అందరికి ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుంది. మరోపక్క నీ అద్భుతమైన నటన మరోసారి మేము ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నందుకు మేమంతా సంతోషిస్తున్నాము. కానీ నువ్వు మా మధ్య లేవనే వాస్తవం మనసులను కలిచివేస్తుంది. ఇలాంటి ఆనంద విషాదాల కలయికే జీవితమేమో.. ఈ జేమ్స్ సినిమా నిన్ను అపరిమితంగా ప్రేమించే మా అందరికి మరెన్నో అనుభూతులను అందిస్తుంది. నీ మధురస్మృతులు నువ్వు మాతో పంచుకున్న మధుర క్షణాలు.. మా మనసులో ఎప్పుడూ నీ స్వచ్చమైన నవ్వంతా పదిలంగా ఉంటాయి. వి ఆల్వేస్ లవ్ యూ అప్పు ఆల్ ది వేరి బెస్ట్ ” అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసారు.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..