Telangana: అర్థరాత్రి చప్పుళ్లు.. భయంతో పోలీసులకు స్థానికుల ఫోన్.. వచ్చి చూడగా షాకింగ్ సీన్

టెక్నాలజీ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. త్వరలో 5జీ రాబోతుంది. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ కూడా కనిపెట్టాం. కానీ.. మూఢనమ్మకాలకు మాత్రం ఎండ్ కార్డ్ వేయలేకపోతున్నాం.

Telangana: అర్థరాత్రి చప్పుళ్లు.. భయంతో పోలీసులకు స్థానికుల ఫోన్.. వచ్చి చూడగా షాకింగ్ సీన్
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2022 | 6:54 PM

Mahabubabad: టెక్నాలజీ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. త్వరలో 5జీ రాబోతుంది. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్(Corona Vaccine) కూడా కనిపెట్టాం. కానీ.. మూఢనమ్మకాలకు మాత్రం ఎండ్ కార్డ్ వేయలేకపోతున్నాం.  క్షుద్రపూజలు(Black Magic) చేస్తున్నారని వారిని హత్య చేసిన ఉదంతాలు.. క్షుద్రపూజల పేరిట కొందరు మోసం చేసిన ఘటనలు కూడా గతంలో ఎన్నో వెలుగుచూశాయి. ముఖ్యంగా పల్లెల్లో, తండాల్లో ఈ భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ఆది, బుధ వారాలు వచ్చాయంటే చాలు ఏదో ఒకచోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. తాజాగా  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. కాకతీయకాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా క్షుద్రపూజలు నిర్వహించారు.  ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి క్షుద్రపూజలు నిర్వహించాడు మాంత్రికులు. కోళ్లు బలిచ్చి, నిమ్మకాయలు, జీడిగింజలు, పసుపు- కుంకుమతో తాంత్రిక పూజలు చేశారు. రాత్రి పూట ఇంటి నుంచి చప్పుళ్లు వినిపించడంతో స్థానికుల భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మహబూబాబాద్ సీ.ఐ సతీష్ స్పాట్ కు చేరుకున్నారు. క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ఇద్దరు మాంత్రికులతో పాటు, మరోవ్యక్తి అరెస్ట్ చేశారు. ఓ మహిళ కుమారుడికి వాహన గండం ఉందని నమ్మించి.. ఆ గండం నుండి రక్షిస్తామని క్షుద్రపూజలు నిర్వహించాడు పూజారులు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఖిలాడీ పూజారాలను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే

సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..