Hyderabad: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైదరాబాద్ నడిబొడ్డున సన్మానం చేస్తామన్న మంత్రి కేటీఆర్ ఎందుకో తెలుసా!

Hyderabad: హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని పార్టీల వారు కలిసి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. బిజెపి (BJP) టిఆర్ఎస్(TRS) కార్పొరేటర్లు  కలిసి నగరాన్ని  అభివృద్ధి చేయడం కోసం పోటీ పడదామని..

Hyderabad: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైదరాబాద్ నడిబొడ్డున సన్మానం చేస్తామన్న మంత్రి కేటీఆర్ ఎందుకో తెలుసా!
Telangana Minister KTR vs Union Minister Kishan Reddy
Follow us

|

Updated on: Mar 16, 2022 | 8:35 PM

Hyderabad: హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని పార్టీల వారు కలిసి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. బిజెపి (BJP) టిఆర్ఎస్(TRS) కార్పొరేటర్లు  కలిసి నగరాన్ని  అభివృద్ధి చేయడం కోసం పోటీ పడదామని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలని, మిగిలిన సమయంలో అభివృద్ధి కోసం మాత్రమే పోటీపడాలని సూచించారు.  వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల తో పనులు చేపట్టిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 10,000 కోట్ల రూపాయలను మంజూరు చేయించి తీసుకుని రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేటీఆర్   కోరారు.

భాగ్యనగరం వరద ముంపుకు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. వరద ముంపుకు కేంద్రం  నిధులు మంజూరు చేయాలని … కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలా నిధులు తెస్తే హైదరాబాద్ నడిబొడ్డున పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎల్.బి నగర్ నియోజకవర్గంలో రూ. 103 కోట్ల వ్యయంతో చేపట్టే 8 నాలా అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శాసన మండలి సభ్యులు బి.దయానంద్, శాసనసభ్యుడు, సుధీర్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

వికేంద్రీకరణ చేసి నలువైపులా అభివృద్ధి: హైదరాబాద్ నగరాన్ని నలువైపులా ఒకే విధమైన అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.   రెండు పడకల గదుల నిర్మాణాలను 1000 ఇళ్లు పూర్తయ్యాయని..  మిగతావి కూడా వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ఇప్పటికే నగరంలో పలు ప్లై ఓవర్లు అందుబాటులోకి రాగా..  ఎల్.బి నగర్ ఫ్లైఓవర్, నాగోల్ చౌరస్తా వద్ద 6 లైన్ ల ఫ్లై ఓవర్, బైరమల్ గూడ రెండవ స్థాయిలో ఫ్లైఓవర్ రైట్  లెఫ్ట్ సైడ్ రెండు లూప్ పనులు అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.

1000 పడకల ఆసుపత్రి నిర్మాణం: ఉప్పల్‌లో ప్రాంతంలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు గాంధీ, ఉస్మానియాకు వెళ్లకుండా ఇక్కడే ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మన బస్తీ, మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయనున్నట్లు ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు.

అండర్ పాస్, ఫ్లైఓవర్‌లు ప్రారంభం: వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (SRDP) ద్వారా రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎల్.బి నగర్ ఆర్.హెచ్.ఎస్ అండర్ పాస్ ను, రూ. 29 కోట్ల వ్యయంతో చేపట్టిన బైరమల్ గూడ ఎల్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి లను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు.

Also Read:

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడి మాత్రమే కాదు, జీవించే హక్కుపై దాడి.. సంఘర్షణను వెంటనే ఆపండిః జెలెన్‌స్కీ