Kuwait Triple Murder Case: కువైట్ జైలులో ఉన్న కడప వాసి ఆత్మహత్య.. ముగ్గురి హత్య కేసులో..
Kadapa resident suicide in Kuwait: కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న కడప వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం కస్టడీలో ఉంచిన
Kadapa resident suicide in Kuwait: కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న కడప వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం కస్టడీలో ఉంచిన సెంట్రల్ జైలులో మంచానికి ఉరి వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కడప వాసి వెంకటేష్ ఆర్దియా ప్రాంతంలో ముగ్గురు కువైట్ కుటుంబ సభ్యులను హత్య చేశాడన్న అభియోగంతో పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే.. వెంకటేష్ కుటుంబసభ్యుల విన్నపం మేరకు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వెంకటేష్ భార్య స్వాతి సైతం తన భర్తను అక్రమంగా కేసులో ఇరికించారని లక్కిరెడ్డి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అధికారులు, రాజకీయ నాయకుల విన్నపంతో ఎంబసీ అధికారులు కువైట్ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం తనను కస్టడీలో ఉంచిన సెంట్రల్ జైలులోని రెండు వరుసల మంచానికి వస్త్రంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ ఆధారాల కోసం సెంట్రల్ జైలు అధికారులు ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం అందించారు. అయితే.. ఈ కేసులో వెంకటేశ్ అనుమానితుడిగా ఉన్నట్లు కేసు షీటులో పేర్కొన్నారు. కాగా.. ఈ విషయం తెలుసుకోని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా.. కడప లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన వెంకటేష్ కువైట్లోని ఆర్దియా పట్టణంలో సేఠ్ అహ్మద్ (80) వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్.. ఇటీవల వ్యాపారితోపాటు ఆయన భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను హతమార్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇంట్లో దొంగతనం చేయబోతే యజమాని అడ్డుకోగా.. చంపాడని ఈ కేసులో అనుమానితుడిగా చేర్చారు.
Also Read: