Hyderabad: ప్రముఖ సింగర్ బలవన్మరణం.. ఉరివేసుకొని ఆత్మహత్య..

Hyderabad: ఓ ప్రముఖ గాయకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని చంపాపేటలో జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమల గిరిలోని పిల్లిగుండ్ల తండాకు...

Hyderabad: ప్రముఖ సింగర్ బలవన్మరణం.. ఉరివేసుకొని ఆత్మహత్య..
Suicide
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2022 | 3:02 PM

Hyderabad: ఓ ప్రముఖ గాయకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని చంపాపేటలో జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమల గిరిలోని పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్‌ మోహన్‌ బంజారా పాటలు పాడేవాడు. గతకొంత కాలంగా హైదరాబాద్‌లోని చంపాపేటలో నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే మోహన్ మంగళవారం రాత్రి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఎవరూ లేకపోయేసరికి ఉదయం వరకు ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దీంతో బుధవారం ఉదయం స్థానికులు విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మోహన్‌ మరణంతో అతని స్వగ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే మోహన్‌ పాడిన పలు బంజారా పాటలు యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయ్యాయి.

Also Read: The Kashmir Files: సినిమా చూడమంటూ సర్కారు ఉద్యోగులందరికీ హాఫ్‌ డే లీవ్‌.. ఎక్కడో తెలుసా?..

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!

Holi 2022: ఈ అందమైన ప్రాంతాలను సందర్శించి హోలీని మరింత రంగుల మయం చేసుకోండి..