Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!

వైవిధ్యంగా, కొత్తదనం కోరుకునేవారు.. తరచూ ఏదొకటి ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టిని మనం ఆకర్షించాలంటే.. మనం చేసేపనిలో కాస్త వెరైటీ ఉండాలనుకోవడంలో తప్పులేదు...

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!
Fire Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 16, 2022 | 12:14 PM

సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గర నుంచి ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. వైవిధ్యంగా, కొత్తదనం కోరుకునేవారు.. తరచూ ఏదొకటి ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టిని మనం ఆకర్షించాలంటే.. మనం చేసేపనిలో కాస్త వెరైటీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రాణాలకు ముప్పు వాటిల్లే పనులు ఏదైనా కూడా వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో నెట్టింట వివిధ రకాల స్టంట్ వీడియోలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఎత్తైన కొండపై నుంచి ఒకరు స్టంట్ చేస్తే.. మరొకరు ప్రమాదకరమైన రోడ్డుపై బైక్‌తో స్టంట్.. ఇలా కోకొల్లలు. లైకుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇదే తరహా ఓ స్టంట్ చేయబోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదేంటో చూసేద్దాం పదండి..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన రూమ్‌లో వెనక్కి తిరిగి వీపుకు నిప్పు అంటించుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. లైకులు కోసం చేయాలనుకున్నాడా.? లేకపోతే ఏదైనా స్టంట్‌లో భాగమా అన్నది తెలియదు.. ఆ నిప్పు కాస్తా పెద్దది కావడంతో.. దాని వేడిని తట్టుకోలేక షర్ట్ విప్పడం కాదు.. వెంటనే బాత్రూమ్ వైపుకు పరుగులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి చివాట్లు పెడుతున్నారు.

కాగా, ఈ వీడియోను ‘viciousvideos’ అనే ట్విట్టర్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 14.2 వేల వ్యూస్ వచ్చాయి. అలాగే 316 మంది ఈ వీడియోను లైక్ చేశారు. ‘ఈ వ్యక్తికి ఏమైనా పిచ్చి పట్టిందా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘లైకుల కోసం ఇలా చేస్తారా’ అంటూ మరొకరు విమర్శించారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?