Health News: ఇప్పటి నుంచి చేతులతో ఆహారం తినండి.. చెప్పులు లేకుండా నడవండి.. ఎందుకంటే..?
Health News: సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మాత్రమే తిరిగే మన పూర్వీకులు ఎక్కువ రోజులు బతికారు. కానీ ఆధునిక కాలంలో చాలామంది ప్రకృతికి విరుద్దంగా పనిచేస్తున్నారు.
Health News: సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మాత్రమే తిరిగే మన పూర్వీకులు ఎక్కువ రోజులు బతికారు. కానీ ఆధునిక కాలంలో చాలామంది ప్రకృతికి విరుద్దంగా పనిచేస్తున్నారు. సమయపాలన లేకుండా తినడం, పడుకోవడం చేస్తున్నారు. దీంతో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. కానీ మన పూర్వీకులు ఏ సమయానికి చేసే పని ఆ సమయంలోనే పూర్తి చేసేవారు. వారు పాటించిన సంసృతి సంప్రదాయల వెనుక ఎంతో సైన్స్ దాగుంది. చాలామంది ఆహారం టీవి చూస్తూ, ఫోన్ చూస్తూ తింటారు. ఇంకొంత మంది ఏదో ఒక పనిచేసుకుంటూ స్పూన్లతో తింటారు. మరికొందరు బెడ్‌పైనే ఫుడ్ లాగించేస్తారు. వాస్తవానికి ఆహారం అలా తినకూడదు. అన్నం ఎప్పుడైనా చేతివేళ్లతో కలుపుకొని తినాలి. ఎందుకంటే దీని వెనుక శాస్త్రీయ పరమార్థం ఉంది. భోజనానికి కూర్చునే ముందు ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. చేతులతో ఆహారం తిన్నప్పుడు చేతి నరాలకి ఒక ఎక్సర్ సైజ్ జరుగుతుంది. ఇది మెదడు, కడుపు, వేళ్ల మధ్య ఒక సమన్వయాన్ని కుదురుస్తుంది. అందుకే ఆహారం నెమ్మదిగా, రిలాక్స్‌గా తినాలని పెద్దలు చెబుతారు. అప్పుడే జీర్ణక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. అంతేకాదు చాలా అధ్యయనాలలో చేతితో ఆహారం తింటే చాలా రుచిగా ఉంటుందని తేలింది.
అలాగే మన ప్రాచీనులు చెప్పులు లేకుండా నడిచేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కనీసం పదినిమిషాలు పచ్చనిగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి మంచి నిద్ర. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కంటినిండా నిద్రపోవడానికి ఈ నడక బాగా సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. వట్టి కాళ్లతో నడవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అంతేకాదు కంటికి కూడా చాలా ఉపయోగ పడుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.