Health News: ఉడికించిన గుడ్డు.. వేయించిన గుడ్డు.. ఏది ఆరోగ్యానికి మంచిది..!
Health News: చాలా మంది అల్పాహారంగా గుడ్లు తింటారు. కానీ ఉడకబెట్టిన గుడ్డు తినాలా లేదా వేయించిన గుడ్డు తినాల అనే సందేహం ఉంటుంది. మరికొంతమంది అధిక కొలెస్ట్రాల్‌కు భయపడి గుడ్లు తినడం మానేస్తారు.
Health News: చాలా మంది అల్పాహారంగా గుడ్లు తింటారు. కానీ ఉడకబెట్టిన గుడ్డు తినాలా లేదా వేయించిన గుడ్డు తినాల అనే సందేహం ఉంటుంది. మరికొంతమంది అధిక కొలెస్ట్రాల్‌కు భయపడి గుడ్లు తినడం మానేస్తారు. ఇంకొందరు బరువును నియంత్రించుకోవడానికి గుడ్డులోని పచ్చసొనని వదిలేస్తారు. అయితే బరువు అదుపులో ఉండాలంటే మాత్రం ఉడకబెట్టిన గుడ్లు తినడం మంచిది. ఎందుకంటే వేయించిన గుడ్డులో కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు వేయించిన గుడ్డుకి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చిన్నపిల్లలకి వేయించిన గుడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉడికించిన గుడ్లను తినవచ్చు. అలాగే అధిక బీపీ ఉన్నవారు ఉడికించిన గుడ్లు తింటే ఏమి కాదు. గుడ్డులోని తెల్లసొనలో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ప్రయోజనకరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. గుడ్లను నూనెతో వేయించడం వల్ల శరీరానికి ఉపయోగపడే పదార్థాలు నాశనం అవుతాయి. పోషకాహార నిపుణులు క్రమం తప్పకుండా ఉడికించిన గుడ్లు తినాలని సిఫార్సు చేస్తారు.
గుడ్డులోని తెల్లసొన భాగంలో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లలో అమినో యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉంటుంది. అదనంగా గుడ్లు కోలిన్ కలిగి ఉంటాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఖనిజం ఉపయోగపడుతుంది. వాస్తవానికి గుడ్లను ఉడకబెట్టి మాత్రమే తినాలి. అలా కాకుండా ఉడికించిన గుడ్డును నూనెలో వేయించి తింటే కేలరీలు కోల్పోతారు. ఇక గుడ్డును ఆమ్లెట్‌లో వేసుకుని తింటే సగం కేలరీలు కూడా మిగిలి ఉండవు. అందుకే ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తారు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.