Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Mann ki Baat: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రధాని పిలుపు

ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన 105వ ఎపిసోడ్ ఈరోజు విడుదలైంది. ఇందులో G20 శిఖరాగ్ర సమావేశం, చంద్రయాన్-3 విజయం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. వచ్చే నెలలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారీ ప్రణాళికల గురించి కూడా ప్రధాని చెప్పారు.

PM Mann ki Baat: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రధాని పిలుపు
Pm Modi Mann Ki Baat
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2023 | 12:22 PM

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తన మనసులోని మాటను మన్ కీ బాత్ కార్యక్రమంలో బయటపెట్టారు. ప్రధాని మోడీ సంబంధించిన ఈ ప్రత్యేక కార్యక్రమం 105వ ఎపిసోడ్ ఈరోజు విడుదలైంది. ఇందులో జి20 శిఖరాగ్ర సమావేశం, చంద్రయాన్-3 విజయం, భారత్-మిడిల్ ఈస్ట్ , యూరప్ మధ్య షిప్పింగ్ కారిడార్ ఒప్పందంపై ప్రధాని చర్చించారు. G20 సదస్సు సందర్భంగా గాంధీకి నివాళులర్పించేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నాయకులతో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న దృశ్యాన్ని దేశం మరచిపోలేదని ప్రధాని అన్నారు.

దేశ విదేశాల నాయకులతో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకోవడం బాపు ఆలోచనలు నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత  ఆచరణాత్మకంగా ఉన్నాయనడానికి నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబ‌ర్ 1న ఉద‌యం 10 గంట‌ల‌కు పరిశుభ్రతపై భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌బోతున్నామని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కర్ణాటక దేవాలయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్ర‌పంచ వారసత్వ జాబితాలోక‌ర్ణాట‌క‌లోని హోయసల దేవాలయాల‌ను చేర్చ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ఆలయాల సముదాయాలను 13వ శతాబ్దంలో నిర్మించారని ప్రధాని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణ భారతీయ సంప్రదాయానికి గౌరవం. ప్రస్తుతం భారత్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద సంఖ్య 42కి చేరుకుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి కూడా ప్రధాని మాట్లాడారు. వరల్డ్ టూరిజం డే టూరిజాన్ని కొంత మంది సందర్శనా వస్తువుగా మాత్రమే చూస్తున్నారని అన్నారు. ఇది ఉపాధికి సంబంధించినది కూడా. పర్యాటక రంగం గరిష్ట ఉపాధిని సృష్టిస్తుంది. గత కొన్నేళ్లుగా భారత్ పట్ల విదేశీయుల ఆకర్షణ పెరిగింది. ఎప్పుడు ఎక్కడికైనా వెళితే భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రధాని సూచించారు.

గత కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్-3, మహిళా రిజర్వేషన్లు, జీ20 సదస్సు గురించి నిరంతరం మాట్లాడుతున్నారు. చంద్రయాన్-3 విజయంతో తన మన్ కీ బాత్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల ఐదు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అదే సమయంలో మహిళా ఎంపీలతో ప్రధాని మోడీ కనిపించారు. మహిళకు అనుకూలంగా ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు మహిళా ఎంపీలు ప్రధాని మోడీకి కృతఙ్ఞతలు చెప్పారు.

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ప్రధాని కార్యాలయం, IT మంత్రిత్వ శాఖ, BJPకి చెందిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, YouTube , PM మోడీకి సంబధించిన వ్యక్తిగత YouTube ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఫేస్‌బుక్ పేజీలో ప్రసారం చేస్తున్నారు. మీరు PM Facebook పేజీలో కూడా వినవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..