Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: ఈ ఊర్లో కోతుల బెడద.. మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ.. ఖర్చు తెలిస్తే షాక్..  

కేసముద్రంలో కోతుల బెడద విపరీతంగా వుంది.. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి.. ప్రతియేటా గణపతి మండపాల వద్ద ప్రసాదాలు ఎత్తుకు పోవడం, గణపతి చేతిలోని లడ్డూ ఎత్తుకు పోవడంతో ఉత్సవ కమిటీలకు నిరాశే మిగిలుతుంది. కోతుల నివారణకు ఈసారి మాస్టర్ ప్లాన్ ఆలోచించారు.. కొండ ముచ్చు ఉంటే కోతులు రావని గుర్తించిన ఆది దేవ సొసైటీ నిర్వాహకులు ఓ కొండముచ్చు కోసం ఆరా తీశారు..

Ganesh Chaturthi: ఈ ఊర్లో కోతుల బెడద.. మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ.. ఖర్చు తెలిస్తే షాక్..  
Lord Ganesha
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Sep 24, 2023 | 12:25 PM

ఊరువాడా గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. బుజ్జి గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అంతేకాదు గణపయ్య చేతిలో లడ్డుని ప్రసాదంగా పెట్టి.. ఉత్సవాల అనంతరం దానిని సొంతం చేసుకునే క్రేజ్ రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ఈ లడ్డుని దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటలు కూడా ఉన్నాయి.  మరికొన్ని చోట్ల కోతులు వాటి నుంచి రక్షణ కల్పించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లడ్డు ప్రసాదాలు కాపాడడం, భక్తుల బభద్ర కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రోజుకు భారీగా ఖర్చుచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్ జిల్లా కే. సముద్రం మండల కేంద్రంలోని ఓ గణపతి మండపం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. భక్తులకు భద్రత, ఉత్సవ కమిటీకి భరోసా లభించింది. గణపతి చేతిలోని లడ్డూకు, భక్తులు తెచ్చే ప్రసాదాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అంతపెద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

కేసముద్రంలో కోతుల బెడద విపరీతంగా వుంది.. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి.. ప్రతియేటా గణపతి మండపాల వద్ద ప్రసాదాలు ఎత్తుకు పోవడం, గణపతి చేతిలోని లడ్డూ ఎత్తుకు పోవడంతో ఉత్సవ కమిటీలకు నిరాశే మిగిలుతుంది. కోతుల నివారణకు ఈసారి మాస్టర్ ప్లాన్ ఆలోచించారు.. కొండ ముచ్చు ఉంటే కోతులు రావని గుర్తించిన ఆది దేవ సొసైటీ నిర్వాహకులు ఓ కొండముచ్చు కోసం ఆరా తీశారు.. భక్తుల పూజ సామాగ్రీ, లడ్డూ రక్షణ కోసం మండపం వద్ద కొండముచ్చు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు వద్ద ఈ కొండ ముచ్చుని తీసుకువచ్చారు.. కొండముచ్చు మెయింటెన్స్ కు ఒక మనిషిని పెట్టి ఖర్చు అంటే.. రోజుకు 1500 రూపాయలు వెచ్చిస్తు మండపం వద్ద కాపలాగా ఉంచారు.

ఈ కొండముచ్చు హై సెక్యూరిటీతో కోతుల బేడదకు పూర్తిగా విముక్తి లభించింది.. భక్తులు పూర్తి బరోసాతో గణపతికి పూజలు నిర్వహిస్తున్నారు.. నైవేద్యాలు సమర్పిస్తున్నారు.. గణపతి చేతిలో ని లడ్డూ కు కూడా నో డౌట్ అనే ధీమా లభించింది.. గణపతి దర్శనానికి వచ్చే భక్తులు కొండేంగను చూసి నిర్వహకులకు వచ్చిన ఐడియా అదుర్స్ అని అనుకుంటున్నారు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..