Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ 5 వస్తువులను ఎప్పుడూ దానం చేయకండి.. లేదంటే మీరు పేదవాళ్లుగా మారుతారు..!

Astrology Tips: సాధారణంగా దానం చేయాలని అందరూ చెబుతున్నారు. దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని, ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయిన చెబుతారు. దానం చేయడాన్ని గొప్ప పుణ్య కార్యంగా భావిస్తారు. ఎవరైనా తమ వద్దకు వచ్చి అర్జించినా.. లేక మనమే ఏదైనా దానం చేయాలనుకున్నా తప్పక చేయొచ్చని చెబుతారు. తద్వారా చేసిన కర్మ ఫలితాల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు వేద పండితులు.

Astro Tips: ఈ 5 వస్తువులను ఎప్పుడూ దానం చేయకండి.. లేదంటే మీరు పేదవాళ్లుగా మారుతారు..!
Donation
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 7:45 PM

Astrology Tips: సాధారణంగా దానం చేయాలని అందరూ చెబుతున్నారు. దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని, ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయిన చెబుతారు. దానం చేయడాన్ని గొప్ప పుణ్య కార్యంగా భావిస్తారు. ఎవరైనా తమ వద్దకు వచ్చి అర్జించినా.. లేక మనమే ఏదైనా దానం చేయాలనుకున్నా తప్పక చేయొచ్చని చెబుతారు. తద్వారా చేసిన కర్మ ఫలితాల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు వేద పండితులు. అయితే, దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని హిందూ మతగ్రంధాలు చెబుతున్నారు. వాటి ప్రకారం.. ఏం దానం చేయాలి? ఏం దానం చేయకూడదు? ఏ సమయంలో దానం చేయాలి? ఏ సమయంలో చేయకూడదు అనే విషయాలను వేద పండితులు చెబుతున్నారు. వీటిని పాటించడం ద్వారా జీవితంలో సమస్యలు ఎదుక్కోకుండా ఉంటారని అంటున్నారు.

దానం చేయడం పుణ్యం మరియు ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మేరకు దానం చేయాలి. కానీ కొన్ని వస్తువులను దానం చేయడం అశుభంగా పేర్కొంటున్నారు. ఈ వస్తువులను దానం చేయడం వలన లక్ష్మీ దేవి, శని దేవుడు సదరు వ్యక్తులపై ఆగ్రహంతో ఉంటారట. తద్వారా వారు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. మరి ఎప్పుడూ దానం చేయకూడని వస్తువుల ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చీపురు: కొత్త లేదా పాత చీపురు ఏదైనా దానం చేస్తే.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో, చీపురు దానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా చీపురు దానం చేయడం మానుకోండి.

ఇవి కూడా చదవండి

పదునైన వస్తువులు: కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో అసమ్మతి ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కలిగిస్తుంది. మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ వస్తువులను కూడా దానం చేయడం మానుకోండి.

నూనె: తైలాన్ని దానం చేయడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. కానీ ఉపయోగించిన, మిగిలిపోయిన లేదా చెడిపోయిన నూనెను ఎప్పుడూ దానం చేయవద్దు. అటువంటి నూనెను దానం చేయడం ద్వారా శని దేవుడి చెడు ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే నువ్వులు లేదా ఆవాల నూనెను దానం చేయండి.

ఆహారం: పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం చాలా పుణ్యం. కానీ ఆహారం పాతబడి, పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి ఆహారాన్ని దానం చేయడం ద్వారా పుణ్యానికి బదులుగా పాపాన్ని మూటకట్టుకుంటారు. జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్లాస్టిక్ వస్తువులు, పాత్రలను దానం చేయడం కూడా గ్రంథాలలో నిషేధించబడింది. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంలో నష్టం కలుగుతుంది. దీనితో పాటు గాజు, అల్యూమినియం, స్టీల్ వస్తువులను కూడా దానం చేయకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..