Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Dung Ganesh: 500 ఏళ్ల నాటి అద్భుతం ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహం..కోర్కెలు తీర్చే దైవం

నల్‌ఖేడా నగరాన్ని పాండవులలోని నల రాజు స్థాపించాడని నమ్మకం. ఈ నగరాన్ని నల నగరంగా పిలిచేవారు. కాలక్రమేణా నగరం పేరు నల్‌ఖేడాగా మారింది. శ్రీ గణేష్ ప్రతిష్టించిన ప్రదేశం పూర్వం నగరానికి ప్రధాన ద్వారంగా ఉండేది. ఈ మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించవచ్చు. నగరం చుట్టూ ఒక పెద్ద గోడ ఉంది.. దానిని నాగర్ కోట్ అని పిలుస్తారు.

Cow Dung Ganesh: 500 ఏళ్ల నాటి అద్భుతం ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహం..కోర్కెలు తీర్చే దైవం
Mp Cow Dung Ganesh
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2023 | 9:35 AM

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో నల్‌ఖేడా ప్రధాన కూడలిలో చాలా పురాతనమైన గణేశ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం విశిష్టత ఏమిటంటే.. ఆవు పేడతో తయారు చేయబడింది. అందుకే ఆ విగ్రహాన్ని ఆవు పేడ వినాయకుడు అంటారు. పురాతన కాలం నుండి ఈ ఆలయం భక్తులకు  విశ్వాస కేంద్రంగా ఉంది. చాలా పురాతన ఈ ఆలయంలో గణేశుడితో పాటు, సిద్ధి, బుద్ధి కూడా ఉన్నారు. ఆవు పేడతో చేసిన ఈ శ్రీ గణేషుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు.

అదే సమయంలో ఈ కూడలికి గణేష్ దర్వాజా అని కూడా పేరు పెట్టారు. గణేష ఉత్సవ పండుగ సందర్భంగా, గణేష దర్వాజ వద్ద ఉన్న ఈ గణేష ఆలయంలో  సిద్ధి బుద్ధితో పాటు గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారికి పూజలను చేస్తారు.

500 ఏళ్ల కంటే పురాతన గణేష్ విగ్రహం

ఈ శ్రీ గణేశుడి విగ్రహం ఐదు వందల సంవత్సరాల నాటి ఆవు పేడతో నిర్మితమైందని చెబుతారు. భక్తుల కోరికలను తీర్చే శ్రీ గణేశుని అందమైన అలంకరణతో ఆకర్షణీయంగా దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి నగరంతో పాటు అనేక సమీప ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

ఇవి కూడా చదవండి

నల రాజు స్థాపించిన నగరం

నల్‌ఖేడా నగరాన్ని పాండవులలోని నల రాజు స్థాపించాడని నమ్మకం. ఈ నగరాన్ని నల నగరంగా పిలిచేవారు. కాలక్రమేణా నగరం పేరు నల్‌ఖేడాగా మారింది. శ్రీ గణేష్ ప్రతిష్టించిన ప్రదేశం పూర్వం నగరానికి ప్రధాన ద్వారంగా ఉండేది. ఈ మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించవచ్చు. నగరం చుట్టూ ఒక పెద్ద గోడ ఉంది.. దానిని నాగర్ కోట్ అని పిలుస్తారు.

10 అడుగుల ఎత్తైన విగ్రహం

పురాతన కాలంలో ఆవు పేడతో చేసిన 10 అడుగుల ఎత్తైన విగ్రహం ఇక్కడ నగరం ప్రధాన ద్వారం వద్ద స్థాపించబడింది. ఇది ప్రాచీన కాలం నుండి భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఎవరు స్థాపించారు అనే చరిత్ర ఎక్కడా అందుబాటులో లేదు.. కానీ పురావస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం 500 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని స్థాపించినట్లు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది.

విదేశీ భక్తులు దర్శనం

నల్‌ఖేడాలో పీతాంబర మాత, బగ్లాముఖి ఆలయానికి సంబంధించిన సిద్ధపీఠం కూడా ఉంది. ఇది చాలా పురాతన దేవాలయం. యుద్ధంలో విజయం సాధించడానికి శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు పాండవులు దీనిని స్థాపించారు. అందుకే దేశంతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

శ్రీ గణేశుడు సిద్ధి బుద్ధితో కలిపి పూజలను అందుకుంటున్నారు. విగ్రహం దగ్గర గణపయ్య వాహనమైన ఎలుక కూడా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తమ కోరికలను తీర్చమంటూ మంగళమూర్తి ఆవు పేడ గణపయ్యను దర్శించుకోవడానికి వస్తారు. గణేశుడు అందరి కోరికలను తీరుస్తాడని విశ్వాసం. ]

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)