Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో పతకాల ఖాతా తెరచిన భారత్.. షూటింగ్, రోయింగ్ విభాగాల్లో మెడల్స్..
భారతదేశం నుండి 600 మందికి పైగా అథ్లెట్లు ఈసారి గేమ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఆసియా క్రీడల్లో తొలి రోజునే భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. తక్కువ సమయంలోనే భారత్ 2 పతకాలు సాధించింది. ఈ రెండు పతకాలు రజతం కావడం విశేషం. షూటింగ్‌లో భారత్ తొలి పతకం సాధించింది. పురుషుల డబుల్స్ లైట్ వెయిట్ స్కల్‌లో రెండో పతకం సాధించింది. ఈ రెండు పతకాలతో భారత్ పతకాల పట్టికలో తన పేరును లిఖించుకుంది.
ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబరు 23 శనివారం గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో అధికారికంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 19 నుండి అనేక టీమ్ ఈవెంట్‌లలో పోటీలు జరుగుతూనే ఉన్నయ్హి. అయితే పతకాల కోసం నిజమైన రేసు ఆదివారం సెప్టెంబర్ 24 అంటే ఈ రోజు నుండి మొదలైంది. భారతదేశం నుండి 600 మందికి పైగా అథ్లెట్లు ఈసారి గేమ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఆసియా క్రీడల్లో తొలి రోజునే భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. తక్కువ సమయంలోనే భారత్ 2 పతకాలు సాధించింది. ఈ రెండు పతకాలు రజతం కావడం విశేషం. షూటింగ్‌లో భారత్ తొలి పతకం సాధించింది. పురుషుల డబుల్స్ లైట్ వెయిట్ స్కల్‌లో రెండో పతకం సాధించింది. ఈ రెండు పతకాలతో భారత్ పతకాల పట్టికలో తన పేరును లిఖించుకుంది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్ షూటింగ్‌లో రజతం సాధించింది. మరోవైపు రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు రెండవ రజత పతకాన్ని గెలుచుకుంది.
షూటింగ్‌లో భారత్‌కు తొలి పతకం
ఆసియా క్రీడలు 2023లో షూటింగ్‌తో భారత్ పతకాల వేట మొదలు పెట్టింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రమిత, మెహులీ, ఆషి కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ముగ్గురూ కలిసి 1886 పాయింట్లు సాధించగా… అందులో రమిత 631.9 పాయింట్లు సాధించింది. మెహులీ 630.8 సాధించగా, ఆషి 623.3 పాయింట్లు సాధించింది.
రోయింగ్ డబుల్స్ స్కల్‌లో భారత్ రెండో పతకం
షూటింగ్‌లో రజత పతకం సాధించిన కొద్దిసేపటికే రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో భారత్‌కు మరో అవకాశం లభించింది. పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్ సింగ్, జాత్‌సింగ్‌లు 6:28:18తో సెకండ్ ప్లేస్ లో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో బంగారు పతకం చైనాకు దక్కింది.
ఆసియా క్రీడల్లో పతకాలను సాధించే ప్రతిభావంతమైన క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ చాలా మంది ఆటగాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మరోవైపు ఈ రోజు భారత కికెట్ కూడా పతాకాన్ని అందుకుంటుందని క్రీడాభిమానులు ఆశతో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..